జూన్ 7న తాండూరులో కాంగ్రెస్ బిఎల్ఏ లకు శిక్షణ
తాండూర్ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సార్)పై అవగాహన కల్పించనున్న కాంగ్రెస్ పార్టీ
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీన తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఏ ల (బూత్ లెవల్ ఏజెంట్లు) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తాండూర్ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ మేరకుటీపీసీసీ అధిష్టానం సూచనల మేరకు, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల ప్రకారం గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూర్ నియోజకవర్గ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్వీనర్ కరణం పురుషోత్తం రావు మాట్లాడుతూ… జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి తాండూర్ పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ బిల్ ఓ ల శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సార్ రాష్ట్ర కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే టి. రాం మోహన్ రెడ్డి హాజరుకానుండగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధారాసింగ్‌తో పాటు టీపీసీసీ నియమించిన పలువురు ట్రైనర్లు పాల్గొని సార్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
తాండూర్ నియోజకవర్గ పరిధిలోని 269 పోలింగ్ బూత్‌లకు చెందిన పోలింగ్ ఏజెంట్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల, గ్రామ, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, ఆత్మ కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పీఏసి ఎస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.శిక్షణ కార్యక్రమంలో సార్ ఉద్దేశాలు, విధివిధానాలు, ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బీఎల్ ఓ లకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సార్ అమలుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను కూడా ఈ కార్యక్రమంలో ప్రస్తావించి పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సన్నాహక సమావేశంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జూన్ 7న తాండూరులో కాంగ్రెస్ బిఎల్ఏ లకు శిక్షణ తాండూర్ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
జూన్ 7న తాండూరులో కాంగ్రెస్ బిఎల్ఏ లకు శిక్షణ
తాండూర్ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సార్)పై అవగాహన కల్పించనున్న కాంగ్రెస్ పార్టీ
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీన తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఏ ల (బూత్ లెవల్ ఏజెంట్లు) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తాండూర్ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ మేరకుటీపీసీసీ అధిష్టానం సూచనల మేరకు, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల ప్రకారం గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూర్ నియోజకవర్గ సార్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్వీనర్ కరణం పురుషోత్తం రావు మాట్లాడుతూ... జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి తాండూర్ పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ బిల్ ఓ ల శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సార్ రాష్ట్ర కన్వీనర్, పరిగి ఎమ్మెల్యే టి. రాం మోహన్ రెడ్డి హాజరుకానుండగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధారాసింగ్‌తో పాటు టీపీసీసీ నియమించిన పలువురు ట్రైనర్లు పాల్గొని సార్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.