తాండూరులో కన్యా పాఠశాల పునఃప్రారంభం

తాండూరులో కన్యా పాఠశాల పునఃప్రారంభం

ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా తిరిగి ప్రారంభం

నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాల కమిటీ కృషి చేయాలి .

మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి

తాండూరు పట్టణంలోని కన్యా పాఠశాలను గురువారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, వార్డు కాంగ్రెస్ నాయకులు రవికుమార్, ప్రహ్లాద్ రావు పళ్ళు, పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి పాఠశాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని పేర్కొంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాల కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్థినులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, జుంటుపల్లి వెంకట్, పాఠశాల కరస్పాండెంట్ గోపిచంద్, పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

🗓 11 Jun 2026 | 07:53 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top