రాష్ట్రంలో బీసీ కులాల సాంప్రదాయ వృత్తులు రోజురోజుకు కనుమరుగవుతుండడం అత్యంత ఆందోళనకరమని, వాటి పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి విమర్శించారు.ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నతి, సాంప్రదాయ వృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.మంగలి, చాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వడ్డెర, స్వర్ణకారులు, దర్జీలు, ఉప్పర, బోయ, గౌడలు, నేతకారులు, కుర్మలు, మత్స్యకారులు తదితర బీసీ వృత్తిదారులు ఆధునిక యుగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, వారి వృత్తులను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు.బీసీల అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాల ప్రకటనలు చేయడం కాదని, సాంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికత, తక్కువ వడ్డీ రుణాలు, ఆధునిక పనిముట్లు, ఉచిత నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి చర్యలు చేపట్టినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బీసీ వృత్తిదారులు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, వారి జీవనోపాధిని రక్షించే విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు, అదే బీసీల జీవనోపాధిని కాపాడే నిర్ణయాలను ఆలస్యం చేయడం సమంజసం కాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ సాంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించి, ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రతి జిల్లాలో బీసీ వృత్తిదారుల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాజ్‌కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు.
బీసీ సాంప్రదాయ వృత్తులుకనుమరుగవుతున్నాయి.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది: