ప్రజలతో మమేకమై పోలీసుల పై విశ్వాసం పెంచాలి ..జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించిన ఎస్పీ
తాండూరు, జూన్ 23: తాండూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం సందర్శించి కార్యాలయ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా సీఐ కార్యాలయంలోని రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలపై రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డితో సమగ్రంగా చర్చించారు.
పరిశీలన అనంతరం కార్యాలయ నిర్వహణ, రికార్డుల నిర్వహణలో పాటిస్తున్న పద్ధతులు, సిబ్బంది పనితీరుపై ఎస్పీ స్నేహ మెహ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కృషిని అభినందించారు. అలాగే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తీరుకు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, మహిళలు మరియు బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో పోలీసు పర్యటనలను మరింత పెంచి ప్రజలతో మమేకం కావాలని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు.
అలాగే పోలీసు శాఖలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అవినీతికి ఏమాత్రం తావు లేకుండా విధులు నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమై పోలీసుల పై విశ్వాసం పెంచాలి ..జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
ప్రజలతో మమేకమై పోలీసుల పై విశ్వాసం పెంచాలి ..జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించిన ఎస్పీతాండూరు, జూన్ 23: తాండూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం సందర్శించి కార్యాలయ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా సీఐ కార్యాలయంలోని రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలపై రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డితో సమగ్రంగా చర్చించారు.