క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరగాలి

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో తొందరపాటు వద్దు.. అర్హులకే ఇళ్లు ఇవ్వాలి

క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే తుది జాబితా రూపొందించాలి

నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు పంపిణీ
నిలిపివేయలి.

బిఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా
పూర్తికాకముందే ఇళ్ల కేటాయింపు ప్రక్రియను హడావుడిగా చేపట్టడం వల్ల నిజమైన అర్హులైన పేద కుటుంబాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని
ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ బిఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్ అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ వార్డుల వారీగా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి, అర్హుల తుది జాబితా సిద్ధమైన తర్వాతే ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు అనేక వార్డుల్లో సమగ్ర విచారణ పూర్తి కాలేదు అని అన్నారు.
ఇప్పటికే సొంత ఇల్లు ఉన్న కొందరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నిజంగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను మాత్రమే అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రతి వార్డులో సమగ్ర విచారణ నిర్వహించి తుది జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, అనంతరం అన్ని అర్హతలు పరిశీలించిన తర్వాత మాత్రమే నిజమైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

🗓 26 Jun 2026 | 07:23 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top