డబుల్ బెడ్‌రూమ్ పంపిణీలో పారదర్శకత లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు..బి ఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్

పేదల హక్కులతో చెలగాటమాడితే భారీ ఉద్యమం ఖాయం …బీఆర్ఎస్ హెచ్చరిక

తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్. శుభప్రద్ పటేల్ హెచ్చరించారు.శనివారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను అధికారిక సమావేశానికి పిలిచి, మరోవైపు పోలీసులతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. పోలీసుల అండతో తాండూర్‌లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిజమైన అర్హులైన పేదలు, బలహీన వర్గాలు, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులకే ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఒత్తిళ్లతో అనర్హులకు ఇళ్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి అధికార పార్టీ అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు.
ఏళ్లుగా దరఖాస్తు చేసుకుని ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది నిరుపేద కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, అర్హుల జాబితాను బహిరంగంగా ప్రకటించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలని సూచించారు.
పేదల హక్కులను హరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తే సహించేది లేదని శుభప్రద్ పటేల్ హెచ్చరించారు. నిరుపేదలు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

డబుల్ బెడ్‌రూమ్ పంపిణీలో పారదర్శకత లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు..బి ఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్

డబుల్ బెడ్‌రూమ్ పంపిణీలో పారదర్శకత లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు..బి ఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్

పేదల హక్కులతో చెలగాటమాడితే భారీ ఉద్యమం ఖాయం ...బీఆర్ఎస్ హెచ్చరిక

తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్. శుభప్రద్ పటేల్ హెచ్చరించారు.శనివారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను అధికారిక సమావేశానికి పిలిచి, మరోవైపు పోలీసులతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. పోలీసుల అండతో తాండూర్‌లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిజమైన అర్హులైన పేదలు, బలహీన వర్గాలు, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులకే ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఒత్తిళ్లతో అనర్హులకు ఇళ్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి అధికార పార్టీ అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు.
ఏళ్లుగా దరఖాస్తు చేసుకుని ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది నిరుపేద కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, అర్హుల జాబితాను బహిరంగంగా ప్రకటించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే తుది జాబితాను ఖరారు చేయాలని సూచించారు.
పేదల హక్కులను హరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తే సహించేది లేదని శుభప్రద్ పటేల్ హెచ్చరించారు. నిరుపేదలు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

🗓 27 Jun 2026 | 05:51 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top