ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు

ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పారదర్శకంగా సవరణలు జరగాలి

ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు

బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలిస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా మంగళవారం యాలాల మండల కేంద్రంలోని బూత్ నంబర్-199లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పారదర్శకంగా, ఖచ్చితంగా సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దడం, కొత్తగా అర్హత పొందిన ఓటర్ల పేర్లను నమోదు చేయడం, అనర్హుల పేర్లను తొలగించడం ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ప్రతి బూత్ స్థాయిలో బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలు కూడా తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జిల్లా ఫిషరీస్ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీదర్, సర్పంచ్ శివయ్య, ఉపసర్పంచ్ శోభారాణి, మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్, సీనియర్ నాయకులు హనుమంతు, అమర్‌నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, మల్లప్ప, నర్సింలు, సత్యనారాయణ రెడ్డి, నాగప్ప, బసవరాజు, శేఖర్, సతీష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🗓 01 Jul 2026 | 07:39 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top