తాండూర్ గోశాల నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం..

అధ్యక్షులుగా వినోద్ కుమార్ జైన్ , కార్యదర్శి మన్మోహన్ సారడ, కోశాధికారి పటేల్ విజయ్ కుమార్

ప్రత్యేక పూజలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం

గోశాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తాం –

అధ్యక్షుడు వినోద్ కుమార్ జైన్

సెప్టెంబర్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహణతాండూర్ పట్టణంలోని గోశాలలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోమాత సేవకు అంకితభావంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా వినోద్ కుమార్ జైన్, ప్రధాన కార్యదర్శిగా మన్మోన్ సారడ, కోశాధికారిగా పటేల్ విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గోశాల అభివృద్ధి, గోవుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం గోశాల సభ్యులు నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శాశ్వత సభ్యుల భాగస్వామ్యంతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సభ్యులు కోరగా, సెప్టెంబర్ నెలలో ప్రత్యేక ఆహ్వానాలతో శాశ్వత సభ్యులను ఆహ్వానించి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని నూతన కమిటీ వెల్లడించింది.
అదేవిధంగా నూతన కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోశాల అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, లింగదలి రవికుమార్, మహేందర్ రెడ్డి అడ్వకేట్, తదితరులు ఉన్నారు.

తాండూర్ గోశాల నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం..

తాండూర్ గోశాల నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం..

అధ్యక్షులుగా వినోద్ కుమార్ జైన్ , కార్యదర్శి మన్మోహన్ సారడ, కోశాధికారి పటేల్ విజయ్ కుమార్

ప్రత్యేక పూజలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం

గోశాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తాం –

అధ్యక్షుడు వినోద్ కుమార్ జైన్

సెప్టెంబర్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహణతాండూర్ పట్టణంలోని గోశాలలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోమాత సేవకు అంకితభావంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా వినోద్ కుమార్ జైన్, ప్రధాన కార్యదర్శిగా మన్మోన్ సారడ, కోశాధికారిగా పటేల్ విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గోశాల అభివృద్ధి, గోవుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం గోశాల సభ్యులు నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శాశ్వత సభ్యుల భాగస్వామ్యంతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సభ్యులు కోరగా, సెప్టెంబర్ నెలలో ప్రత్యేక ఆహ్వానాలతో శాశ్వత సభ్యులను ఆహ్వానించి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని నూతన కమిటీ వెల్లడించింది.
అదేవిధంగా నూతన కార్యవర్గం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోశాల అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, లింగదలి రవికుమార్, మహేందర్ రెడ్డి అడ్వకేట్, తదితరులు ఉన్నారు.

🗓 02 Jul 2026 | 06:49 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top