తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
హామీల అమలు.. ప్రత్యేక చట్టంతో హక్కులకు రక్షణ కల్పించాలి
తాండూర్ ఉద్యమకారుల వినతి
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి –
ప్రత్యేక చట్టంతో హక్కులకు రక్షణ కల్పించాలని కమిటీకి విజ్ఞప్తి
తాండూర్, జూలై 13:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలకు తగిన గౌరవం కల్పిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తాండూర్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు సోమ శేఖర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్షలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు, ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమ ఆశయాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గుర్తింపు పొందిన ప్రతి ఉద్యమకారికి ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, గౌరవ పెన్షన్, అధికారిక గుర్తింపు కార్డు, సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమంలో పోలీసు కేసులు ఎదుర్కొన్న, జైలు జీవితం గడిపిన, ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులకు ప్రత్యేక పునరావాసం, ఉపాధి, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికి అధికారిక ఉద్యమకారుల గుర్తింపు పత్రాలు అందించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమ విజయానికి తోడ్పడిన జేఏసీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, కళాకారులు, రచయితలు, మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయుల సేవలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల పిల్లలకు విద్య, స్కాలర్షిప్లు, ఉన్నత విద్య, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలైన తాండూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ల ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని పేర్కొంటూ, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి కొత్త పరిశ్రమలను స్థాపించాలని కోరారు. స్థానిక యువతతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు. గుర్తింపు పొందిన ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం, గౌరవానికి శాశ్వత రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి హామీల అమలు.. ప్రత్యేక చట్టంతో హక్కులకు రక్షణ కల్పించాలి. తాండూర్ ఉద్యమకారుల వినతి
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
హామీల అమలు.. ప్రత్యేక చట్టంతో హక్కులకు రక్షణ కల్పించాలి
తాండూర్ ఉద్యమకారుల వినతి
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలి –
ప్రత్యేక చట్టంతో హక్కులకు రక్షణ కల్పించాలని కమిటీకి విజ్ఞప్తి
తాండూర్, జూలై 13:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలకు తగిన గౌరవం కల్పిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తాండూర్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు సోమ శేఖర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్షలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలు, ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమ ఆశయాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గుర్తింపు పొందిన ప్రతి ఉద్యమకారికి ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, గౌరవ పెన్షన్, అధికారిక గుర్తింపు కార్డు, సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.