ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై యాలాల పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ న్యాయ సంహిత–2023 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
యాలాల, జూలై 13:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా ఉన్నాయని ఆరోపిస్తూ యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం యాలాల పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండటమే కాకుండా, సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశముందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita – BNS) 2023లోని సంబంధిత నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాలాల పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాలాల మండల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, కృష్ణ హజీపూర్ మాజీ సర్పంచ్ మల్లేశం, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవికుమార్, మొగలప్ప జక్కేపల్లి, యూత్ జనరల్ సెక్రటరీ మెట్లి కృష్ణ, హజీపూర్ కృష్ణతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.