రూ 10 లక్షలతో డ్వాక్రా సంఘం నూతన భవనం

రూ 10 లక్షలతో డ్వాక్రా సంఘం నూతన భవనం
-గ్రామ పంచాయతీలకు నూతన భవనాల మంజూరు
-ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తాం
-తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

పెద్దేముల్ జనవరి 24 :- మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెప్పారు. శనివారం రోజు మండలంలోని గొట్లపల్లి,బండపల్లి గ్రామపంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అదేవిదంగా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గొట్లపల్లి గ్రామంలో మహిళ సంఘం నూతన భవనంను నిర్మించడం కోసం పది లక్షల రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాథమిక ఇవ్వడం కోసం అన్ని సంక్షేమ పథకాలు మహిళ పేరుపైన ఇవ్వడంతో పాటు డ్వాక్రా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నమని చెప్పారు.రాష్ట్రంలో మహిళ సంఘలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించడంతో మహిళలు ఆర్థికంగా వ్యాపార పరంగా వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు.
అదేవిదంగా గొట్లపల్లి గ్రామ శివారులోని మెడల్ స్కూల్ లో చదువుతున్నా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు.
బండపల్లి గ్రామానికి కూడ అంగన్వాడీ, డ్వాక్రా భవనం మంజూరు చేయడం జరిగిందన్నారు.ప్రస్తుతం కొలువు తీరిన నూతన సర్పంచ్ లు గెల్చిన నెలలోపే నియోజకవర్గంలో ఎన్నో గ్రామలకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకునాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపీణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, కోటపల్లి మర్కేట్ కమిటీ చైర్మన్ అంజయ్య, గొట్లపల్లి గ్రామ సర్పంచ్ ఎండి సలాం, ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శారద,బండపల్లి సర్పంచ్ ప్రమీళ, ఉపసర్పంచ్ రవీందర్,వార్డ్ మెంబర్స్ తో పాటు పలు గ్రామల సర్పంచ్ లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

🗓 24 Jan 2026 | 07:02 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top