ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దాతల సహకారంతో కుట్టుమిషన్లు పంపిణీఉత్తమ విద్యార్థులకు సన్మానం

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణమండపంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండాను సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అలాగే మండపం ఆవరణ లో ఉన్న గాంధీ విగ్రహానికిఆర్యవైశ్య సమాజం సభ్యులు మరియు వాసవి మహిళా సంఘం సభ్యులు
పూలమాలలు వేసి నమస్సుమాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ…ఎందరో మహనీయుల త్యాగఫలం తో వచ్చిన భారతదేశ స్వతంత్రం, పూర్తి స్వేచ్ఛాయిత వాతావరణంలో ఉండేందుకు రాజ్యాంగం ను ఏర్పాటు చేసుకొని నిబద్ధతతో పరిపాలన ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసుకుంటున్నాడు మన గణతంత్ర అన్నారు. జై జవాన్ జై కిసాన్ అని నినాదంతో దేశం అభివృద్ధి చెందుతూ పోతుందని అన్నారు. అలాగే సమాజం కోసం కృషి చేసే వారందరినీ మనం గుర్తించాలని సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకుతీసుకువెళ్లాలని అన్నారు.అనంతరం ఆర్యవైశ్య సమాజం సభ్యులు పెండ్యాల అశోక్ దాత సహకారంతోనిరుపేద ఆర్యవైశ్యునికి కుట్టు మిషన్ ను పంపిణీ చేశారు.అలాగే రాష్ట్ర అథ్లెట్స్ లో మొదటి స్థాయిలో విజయం సాధించినఆర్యవైశ్య సభ్యురాలు మంకల్ సంతోషి నీ సమాజం సభ్యులు సన్మానించి సత్కరించారు. రాష్ట్రసైన్స్ ఫెయిర్, మాథెమాటిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులైన వర్షిత సతీష్ శ్రీదేవి, సంజన సతీష్ శ్రీదేవి లను సన్మానించారు.

అనంతరం ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి హోమం లో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సమాజం సభ్యులు ఆర్యవైశ్య సమాజం ప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దాతల సహకారంతో కుట్టుమిషన్లు పంపిణీఉత్తమ విద్యార్థులకు సన్మానం
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణమండపంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ జెండాను సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అలాగే మండపం ఆవరణ లో ఉన్న గాంధీ విగ్రహానికిఆర్యవైశ్య సమాజం సభ్యులు మరియు వాసవి మహిళా సంఘం సభ్యులు
పూలమాలలు వేసి నమస్సుమాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ మాట్లాడుతూ...ఎందరో మహనీయుల త్యాగఫలం తో వచ్చిన భారతదేశ స్వతంత్రం, పూర్తి స్వేచ్ఛాయిత వాతావరణంలో ఉండేందుకు రాజ్యాంగం ను ఏర్పాటు చేసుకొని నిబద్ధతతో పరిపాలన ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసుకుంటున్నాడు మన గణతంత్ర అన్నారు. జై జవాన్ జై కిసాన్ అని నినాదంతో దేశం అభివృద్ధి చెందుతూ పోతుందని అన్నారు. అలాగే సమాజం కోసం కృషి చేసే వారందరినీ మనం గుర్తించాలని సంఘాన్ని అభివృద్ధి దిశగా ముందుకుతీసుకువెళ్లాలని అన్నారు.అనంతరం ఆర్యవైశ్య సమాజం సభ్యులు పెండ్యాల అశోక్ దాత సహకారంతోనిరుపేద ఆర్యవైశ్యునికి కుట్టు మిషన్ ను పంపిణీ చేశారు.అలాగే రాష్ట్ర అథ్లెట్స్ లో మొదటి స్థాయిలో విజయం సాధించినఆర్యవైశ్య సభ్యురాలు మంకల్ సంతోషి నీ సమాజం సభ్యులు సన్మానించి సత్కరించారు. రాష్ట్రసైన్స్ ఫెయిర్, మాథెమాటిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులైన వర్షిత సతీష్ శ్రీదేవి, సంజన సతీష్ శ్రీదేవి లను సన్మానించారు.