అదరగొట్టిన వందే భారత్ ప్రదర్శన
దేశ ఐక్యతను చూపిన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్
– ఆకట్టుకున్న దేశభక్తి నృత్య ప్రదర్శనలు
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ ఐక్యతపై, దేశంలో ఉన్న విభిన్న సంస్కృతినీ అద్దంలాకృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చేసిన ప్రదర్శన అందర్నీఅదరగొట్టేసింది.సోమవారంగణతంత్ర దినోత్సవ సందర్భంగాతాండూరు పట్టణం కృష్ణవేణి కాన్సెప్ట్ హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.డైరెక్టర్లు వెంకటేశం, మల్లేశం, సతీష్ లతోపాటు విద్యార్థులు జాతీయ జెండా ఆవిష్కరణ లో పాల్గొని వందనాలు సమర్పించారు. అనంతరం భారత దేశ సంస్కృతి, ఐక్యతను చాటేలా విద్యార్థులు చేసిన వందే భారత్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందర్నీ ఆకట్టుకుంది. గిరిజన, జానపద నృత్యాలు దేశంలో ఉన్న వివిధ సాంస్కృతి ఐక్యతను అద్దంపట్టేలా ప్రదర్శన ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ ..క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, స్వేచ్చ, ఐక్యత వంటి లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వేడుకలలో కూడా వందే భారత్ ప్రదర్శన ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి తిలకించిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మంగ్లీ నాయక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించి బహుమతులను అందజేశారు.