10వ తరగతి విద్యార్థులకు 5 లక్షల నగదు బహుమతి
-శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బహుమతుల వరం
-2025-26వ విద్యా సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
-శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థను అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు …. 2025-26వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివే విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బహుమతుల వరం కురిపించింది. గురువారం రోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూపొందించిన బహుమ క్యాలెండర్ ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకో తెలంగాణ మిషన్ 10 త్ క్లాస్ అనే నినాదంతో రూపొందించిన క్యాలెండర్ అద్భుతంగా ఉందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో టాపర్లుగా నిలువాలని సూచించారు.శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తలపెట్టిన ఈ ప్రతిభ పురస్కార బహుమతులను తాండూరు నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అన్ని స్థాయిల బహుమతులను సొంతం చేసుకో వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి టాపర్ గా నిలిచిన పదవ తరగతి విద్యార్థులకు రూ 5 లక్షల నగదు బహుమతి అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ డిజిఎం నరేందర్, ఏజీఎం శ్రీనివాస్,తాండూరు బ్రాంచ్ మేనేజర్ ఎ కృష్ణమాచారి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి,సురేష్,గొల్ల శేఖర్, నరేష్, పి.శ్రీనివాస్, శేఖర్, వినయ్, పలువురు రాజకీయ నాయకులు సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
10వ తరగతి విద్యార్థులకు 5 లక్షల నగదు బహుమతి
10వ తరగతి విద్యార్థులకు 5 లక్షల నగదు బహుమతి
-శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బహుమతుల వరం
-2025-26వ విద్యా సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
-శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థను అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు .... 2025-26వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివే విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బహుమతుల వరం కురిపించింది. గురువారం రోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూపొందించిన బహుమ క్యాలెండర్ ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకో తెలంగాణ మిషన్ 10 త్ క్లాస్ అనే నినాదంతో రూపొందించిన క్యాలెండర్ అద్భుతంగా ఉందని చెప్పారు.