ఈ పాడి గేదేలు ఎవరివి!

ఈ పాడి గేదేలు ఎవరివి!
-రెండు రోజులుగా బిజ్వార్ లోనే
-తగిన ఆధారాలతో వచ్చి తీసుకెళ్లాలి
-గ్రామస్తుల సూచన

తాండూరు ఫిబ్రవరి 4 :- తాండూరు మండలం బిజ్వార్ గ్రామంలోని బంజర్ దొడ్డిలో గత రెండు రోజులుగా రెండు పాడి గేదేలు ఉన్నాయని స్థానికులు చెప్పారు. రెండు రోజుల క్రితం ఓ మక్కజొన్న పొలంలో మేస్తుండగా పంట పాడు చేస్తున్నాయని గ్రహించిన ఆ పొలానికి చెందిన రైతు ఆ గేదెలను గ్రామంలోని బంజర దొడ్డికి తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు కూడా ఆ గేదలను తీసుకెళ్లడానికి ఎవరు రాకపోవడంతో ఎక్కడినుండి వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా కూడా సంబంధిత పాడి రైతులు గేదెలకు సంబంధించిన ఆధారాలతో వచ్చి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

🗓 04 Feb 2026 | 05:15 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top