ఆఫర్.. ఆఫర్ ఆఫర్…13 వ వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్

ఆఫర్.. ఆఫర్ ఆఫర్…

తాండూరు మున్సిపల్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మామ వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు

అన్నిట్లో 50% ఆఫర్..

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ప్రచారంలో చివరి ఘట్టం తారాస్థాయికి చేరింది. ఎన్నికలలో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి సురేష్ నాయక్ నిలబడ్డాడు. అయితే ఈ వార్డులోనే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారాసింగ్ తమ్ముడు రాము నాయక్ బరిలో ఉన్నారు.వీరి ఇద్దరి మధ్యన పోటాపోటీ ఉంది. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే వార్డు పట్టు ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాము నాయక్ కు పూర్తిగా మద్దతు తెలుపుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ 13వ వార్డు అన్ని వార్డులకు భిన్నంగా పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.చివరి ఘట్టం తారాస్థాయికి చేరుకోవడంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ మామ తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ తన అల్లుడి గెలుపు కోసం బంపర్ ఆఫర్ ను ప్రకటించారు..తనకు ఉన్న సంస్థలలో వార్డులోని ప్రజలకు 50% రాయితీ కల్పిస్తూ యువకులకు ఉద్యోగాలను అందిస్తున్నట్లుగా ప్రకటించారు.తాండూర్ లో ఆయన ఉన్న వినాయక కన్వెన్షన్ హాల్లో తమ వార్డు ప్రజల పెండ్లీల ఫంక్షన్ల కోసం 50% రాయితీ ప్రకటించారు.
అదేవిధంగా తనకున్న వినాయక హాస్పటల్ నందు కూడా ట్రీట్మెంట్లో 50% రాయితీ ప్రకటించారు అదేవిధంగా మరికొన్ని జిల్లాలలో తనకున్న ఔట్సోర్సింగ్ సంస్థలలో వార్డులోని యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు.
దీంతో 13వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ బంపర్ ఆఫర్ తాండూర్ మున్సిపల్ ఎన్నికలలో బంపర్ ఆఫర్ ఘట్టం చోటు చేసుకుంది.

ఆఫర్.. ఆఫర్ ఆఫర్…13 వ వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్

ఆఫర్.. ఆఫర్ ఆఫర్...

🗓 09 Feb 2026 | 03:24 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top