ఘనంగా సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సావాలు

-ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి
-సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం
-ప్రత్యేక పూజలు చేసిన గిరిజనులు
-మహనీయుడి ఆశయాలు నెరవేరుద్దాం
-మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్

తాండూరు ఫిబ్రవరి 15 :- శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం రోజు తాండూర్ పట్టణంలోని శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ దగ్గర గల సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ సంత్ సేవలల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంచార జీవనం గడిపే గిరిజనులకు ఆయన ఆదర్శనీయుడని గుర్తు చేశారు.అహింసావాద మార్గాన్ని ఎంచుకుని ఆదర్శనీయుడుగా నిలిచారని చెప్పారు అలాగే, సన్మార్గంలో వెళ్తు గిరిజనులకు అనేక బోధలు చేశారన్నారు. ప్రకృతి రక్షణ, మహిళల పట్ల ఆత్మగౌరవం పెంచడం జీవన విధానం కోసం ఆయన చేసిన బోధనలు బంజారా జాతికి దిశానిర్దేశం చేశాయని చెప్పా రు. సత్యం, ధర్మం అనేది సామాజిక సంస్కరణల చుట్టూ తిరుగుతాయని గిరిజనులకు హిత బోధ చేశారని పేర్కొన్నారు.అహింస పరమో ధర్మః. జీవ హింస చేయడం మహాపాపం అని మత్తు పానీయాలకుదూరంగా ఉండి, సన్మార్గంలో జీవించా లని సూచించారని గుర్తు చేశారు.తల్లిదండ్రులను, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం అనే సూక్తిని వినిపించారు.సత్యం, నిజాయి తీతో కూడిన జీవనం అని బంజారా సమా జానికి ఆత్మగౌరవాన్ని తెస్తుంద నేది నిజమైన సత్యమ ని చెప్పారు.సంచార జీవితాన్ని వదిలి స్థిర నివాసం ఏర్పరచు కొని, విద్యావంతులు కావాలని సేవలాల్ మహారాజ్ ఎన్నో సందర్భాలలో వివరించారని చెప్పారు.అమ్మ భవాని మాత ను పూజించండి, కానీ ఎలాంటి ప్రలోభాలకు లోనుకా కండి అనేది ఆయన చూపిన మార్గమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 13వ వార్డు నూతన కౌన్సిలర్ గా ఎన్నికైన కొర్ర సురేష్, మాజీ కౌన్సిలర్ వెంకట్రాం నాయక్, విశ్రాంత ఉద్యోగి నర్సా నాయ క్,భషీర్ మియా తాండ మాజీ సర్పంచ్ మిత్రు నాయక్, పలువురు గిరిజన ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.

🗓 15 Feb 2026 | 06:48 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top