డ్వాక్రా సంఘం నూతన భవన నిర్మాణానికి మార్కింగ్
డ్వాక్రా సంఘం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
సర్పంచును సన్మానించిన మహిళా సంఘాలు

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్గెస్ పూర్ గ్రామంలో డ్వాక్రా సంఘాల మహిళ సభ్యులకు గ్రామ సర్పంచ్ వై ప్రవీణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే గ్రామానికి నూతనంగా మంజూరైన డ్వాక్రా భవనం నిర్మాణానికి తాండూరు పంచాయతీరాజ్ శాఖ ఏఈ నందిని రెడ్డి సమక్షంలో మార్కింగ్ (ముగ్గు) వేయడం జరిగిందని చెప్పారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. అదే విధంగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరాయంగా ఎమ్మెల్యే సహాయ సహకారాలు తీసుకుంటానని గుర్తు చేశారు. తదుపరి బోనమ్మ దేవాలయం వద్ద మహిళా సంఘాల సభ్యులు సర్పంచు, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.