సర్వే ఆధారంగా కాంగ్రెస్ టికెట్లు
వికారాబాద్ లో ఆశావహుల దరఖాస్తుల సందడి

వికారాబాద్: …సర్వే ఆధారంగానే గెలుపు గుర్రాలకి కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరుగుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టం చేయడంతో ఆశావహులు కౌన్సిలర్ టికెట్ దరఖాస్తు కోసం పోటీపడుతున్నారు. నేడు చివరి రోజు కావడంతో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆశావహులతో దరఖాస్తుల సందడి నెలకొంది. అయితే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నేడో రేపో కౌన్సిలర్ టికెట్ లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా టికెట్లు ఎవరికీ దక్కనున్నాయోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
సర్వే ఆధారంగా కాంగ్రెస్ టికెట్లు
సర్వే ఆధారంగా కాంగ్రెస్ టికెట్లు
వికారాబాద్ లో ఆశావహుల దరఖాస్తుల సందడి
వికారాబాద్: ...సర్వే ఆధారంగానే గెలుపు గుర్రాలకి కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరుగుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టం చేయడంతో ఆశావహులు కౌన్సిలర్ టికెట్ దరఖాస్తు కోసం పోటీపడుతున్నారు. నేడు చివరి రోజు కావడంతో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆశావహులతో దరఖాస్తుల సందడి నెలకొంది. అయితే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నేడో రేపో కౌన్సిలర్ టికెట్ లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా టికెట్లు ఎవరికీ దక్కనున్నాయోనని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
