జీరామ్జీ ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో అమలు అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది
- నిధులన్నీ కేంద్రానివే.. ప్రతి వార్డులో బిజెపి పార్టీ అభ్యర్థి
- చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
జీరామ్జీ ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో అమలైతే దేశంలో కాంగ్రెస్ మనుగడా లేకుండా చచ్చి పోతుందని, అలగే పంచాయతీ రాజ్ సిద్ధాంతాలు బలపడి గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని
వీర్ శెట్టిపల్లి గ్రామంలో జీరామ్జీ ఉపాధి హామీ పథకం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనకిందమండలంలోని గౌతపూర్ నుంచి పర్వతాపూర్ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు పనులను, అలాగే తాండూరు మున్సిపల్ లోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …
2005 లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం తీసుక రావడం జరిగిందని అన్నారు.అప్పటి నుంచి ఉపాధి హామీ కొనసాగుతూ వస్తున్నప్పటికీ, అనేక అవినీతులు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు అవినీతిజరిగిందని, లంచాలు ఇచ్చి గ్రామాల్లో బిల్లులు చేయించుకున్నారని అన్నారు. ఈ పథకం గ్రామాభివృద్ధికి కాకుండా కేవలం ఓట్ల కోసమే ఉపయోగపడిందని విమర్శించారు.
పాత పథకంలోని లోపాలను సవరించి 2014-16 లో సవరించిందని అన్నారు మధ్యవర్తులకు లంచాలు పోకుండా తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘మోడి ఫైడ్ భారత్ గ్రామీణ జీరామ్జీ పథకం’ను తీసుకువచ్చారని తెలిపారు. ఈ పథకం ద్వారా నిజమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు ఇస్తే, ఇప్పుడు రాష్ట్రం 40 శాతం ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. అలాగే పనిదినాలను 25 రోజులు పెంచినట్లు తెలిపారు.పాత పథకంలో కాళ్లు, చేతులు లేని వారు పనిచేసినట్లు చూపించి డబ్బులు కాజేశారని, చనిపోయిన వారి పేర్లపై కూడా బిల్లులు లేపిన ఘటనలు ఉన్నాయని ఆరోపించారు. 2006 నుంచి 2011 మధ్య బీహార్లో రూ.5,975 కోట్ల స్కాం జరిగిందని, ఆ కేసు ఇప్పటికీ నడుస్తోందని గుర్తు చేశారు. దీనిని అరికట్టేందుకే మోదీ ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు.గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ చేతుల్లో అధికారం ఉండగా, గాంధీ పేరు చెప్పుకొని గ్రామాలను కాంగ్రెస్ నాశనం చేసిందని ఆరోపించారు.

జీరామ్జీపథకంవిజయవంతమైతే కాంగ్రెస్ సచ్చిపోతుందని, అందుకే గాంధీ పేరు తొలగిస్తారా అంటూ రాహుల్ గాంధీ ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తోందని అన్నారు. అని ఈ ధర్నాలకు ఎవరు కూడా గ్రామ ప్రజలు సహకరించడం లేదని అన్నారు.గాంధీ పేరు చెప్పుకొని దోచుకున్నది కాంగ్రెస్ నాయకులేనని విమర్శించారు.రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కేంద్రానికి 19 రాష్ట్రాలు ఉండగా కాంగ్రెస్కు 2 రాష్ట్రాలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. నష్టం జరిగితే కేంద్రానికే జరుగుతుందని, రాష్ట్రానికి కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు నకిలీ కార్డులు తీసేయొద్దా, స్కాములు కొనసాగించాలా అన్న విషయంపైనే కొట్లాడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతోనే జరుగుతోందని తెలిపారు. గతంలో కేసీఆర్ నిధులను కాళేశ్వరానికి మళ్లించారని గుర్తించిన ప్రధాని మోదీ, నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేలా చేశారని చెప్పారు.

*మునిసిపల్ ఎన్నికలపై వ్యాఖ్యలు*
పార్లమెంట్ సమావేశాల సమయంలోనే మునిసిపల్ ఎన్నికలు పెట్టారని, తాము లేని సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో రెండు మునిసిపల్ చైర్మన్ స్థానాలను గెలుచుకుంటామని, ప్రతి వార్డులో అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. 50 ఓట్లు వచ్చినా కూడా మున్సిపల్ లో అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందని అన్నారు ప్రజలే తమను గెలిపిస్తారని ప్రజలపై నమ్మకం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ బాలేశ్వర గుప్తా, జిల్లా నాయకులు గొప్ప శ్రీహరి, మండల మాజీ అధ్యక్షులు ఆంజనేయులు, మండల ఇంచార్జ్ అధ్యక్షులు విజయకుమార్, స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.

అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ...