17వ వార్డులో ఎగిరేది బిఆర్ఎస్ జెండా నే

17వ వార్డులో ఎగిరేది బిఆర్ఎస్ జెండా నే
– బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టి.ఆనంద్ నామినేషన్

వికారాబాద్ మునిసిపల్ లో నామినేషన్ల పర్వం చివరి రోజు అత్యధికంగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శాసనసభాపతి, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య నామినేషన్ వేయడం జరిగింది.అదే వార్డు కు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి టి.ఆనంద్ శుక్రవారం నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ…ప్రజలందరి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగిందని,వార్డు సమస్యల పట్ల,అభివృద్ధి పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.తాను ఎల్లప్పుడూ వార్డులోనే ఉంటూ అభివృద్ధి కి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.17వ వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.నామినేషన్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,వార్డు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

17వ వార్డులో ఎగిరేది బిఆర్ఎస్ జెండా నే

17వ వార్డులో ఎగిరేది బిఆర్ఎస్ జెండా నే
- బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టి.ఆనంద్ నామినేషన్

వికారాబాద్ మునిసిపల్ లో నామినేషన్ల పర్వం చివరి రోజు అత్యధికంగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శాసనసభాపతి, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య నామినేషన్ వేయడం జరిగింది.అదే వార్డు కు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి టి.ఆనంద్ శుక్రవారం నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ...ప్రజలందరి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగిందని,వార్డు సమస్యల పట్ల,అభివృద్ధి పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.తాను ఎల్లప్పుడూ వార్డులోనే ఉంటూ అభివృద్ధి కి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.17వ వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.నామినేషన్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,వార్డు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

🗓 30 Jan 2026 | 05:54 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top