గడ్డం అనన్యకు తిరుగు లేనట్టే
– సంపూర్ణ మద్దతు తెలిపిన బిఆర్ఎస్ అభ్యర్థి
– 17వ వార్డులో సునాయాస విజయం దిశగా అనన్య అడుగులు

వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి, స్పీకర్ తనయురాలు గడ్డం అనన్య కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న 17వ వార్డు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టి.ఆనంద్ కాంగ్రెస్ పార్టీలో చేరి గడ్డం అనే అన్నకు సంపూర్ణ మద్దతు తెలపడంతో బిఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. వార్డు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆనంద్ చెప్పుకొచ్చారు. ఇక 17వ వార్డులో గడ్డం అనన్య సునాయాస గెలుపుకు ఎలాంటి తిరుగు లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే మొత్తం 34 వార్డులలో రెండు వార్డులను కాంగ్రెస్ ముందే ఏకగ్రీవం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి అడుగులు వేస్తుంది.
గడ్డం అనన్యకు తిరుగు లేనట్టే – ..సంపూర్ణ మద్దతు తెలిపిన బిఆర్ఎస్ అభ్యర్థి
గడ్డం అనన్యకు తిరుగు లేనట్టే
- సంపూర్ణ మద్దతు తెలిపిన బిఆర్ఎస్ అభ్యర్థి
- 17వ వార్డులో సునాయాస విజయం దిశగా అనన్య అడుగులు