బిజెపి సత్తా చాటుతాం
– 31వ వార్డులో బిజెపి నేతల ప్రచారం
– అభ్యర్థి శ్రావణ్ కుమార్ ను గెలిపించాలని వార్డు ప్రజలకు అభ్యర్థున
వికారాబాద్:… మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతామని బిజెపి మాజీ అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి, వడ్ల నందు, బుస్స శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం 31వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ.. కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే
అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని 31వ వార్డు బిజెపి అభ్యర్థి శ్రావణ్ కుమార్ (చందు) అన్నారు.గురువారం వార్డులో ఇంటింటా తిరుగుతూ కమలం పువ్వు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.

తనను గెలిపిస్తే వార్డులో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించి పారిశుద్ధ్య లోపం లేకుండా చూస్తానని ఓటర్లకు మాటిచ్చారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆదరించి, ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 31వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
బిజెపి సత్తా చాటుతాం
బిజెపి సత్తా చాటుతాం
- 31వ వార్డులో బిజెపి నేతల ప్రచారం
- అభ్యర్థి శ్రావణ్ కుమార్ ను గెలిపించాలని వార్డు ప్రజలకు అభ్యర్థున
వికారాబాద్:... మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతామని బిజెపి మాజీ అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి, వడ్ల నందు, బుస్స శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం 31వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ.. కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే