తాండూరు ‘ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ
చైర్ పర్సన్ గా రేపే ప్రమాణ స్వీకారం
వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే
భారీ ఏర్పాట్లలో బిజీబిజీ
నెరవేరిన సాయిపూర్ వాసుల కల
తాండూరు ప్రథమ మహిళగా కాంగ్రెస్ పార్టీ నుండి 12 వ వార్డు నుండి భారీ మెజార్టీతో ఎన్నికైన పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి రేపు చైర్ పర్సన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకున్న తరుణంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నీరజ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ , మైనార్టీ కోటాలో వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ లను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ మేరకు రేపు మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చేపట్టనున్న ప్రమాణ స్వీకారం లో భాగంగా పట్లోళ్ల నీరజ భర్త మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి అనుచర గణం భారీ ఏర్పాట్లలో బిజీ బిజీ అయింది.
కొన్నేళ్లుగా తమ ప్రాంతవాసి తాండూరు మున్సిపల్ పిఠాన్ని అధిరోహించాలన్న సాయిపూర్ వాసుల కల రేపటితో నెరవేరనుంది.
తాండూరు ‘ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ’!
తాండూరు 'ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ