రోహిత్ రెడ్డి ఇంటి వద్ద తాండూరు పోలీసులు
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు మణికొండలో ఉన్న ఆయన నివాసం వద్దకు తాండూరు, వికారాబాద్ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆదివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు మణికొండలో ఉన్న రోహిత్ ఇంటికి 6 గంటల సమయంలో తాండూరు, వికారాబాద్ పోలీసులు భారీగా చేరుకున్నారు. గత శుక్రవారం
తాండూరు పట్టణంలో సెంట్ మార్క్స్ హైస్కూల్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల కేంద్రం లోకి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన అనుచరులతో కలసి లోపలికి వెళ్లారు. ఇది గ్రహించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన అనుచరులతో కలసి తను కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సిఐలు సంతోష్, ప్రభాకర్ రెడ్డి రోహిత్ రెడ్డిని వారి అనుచరులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వారి అనుచరుల మధ్య మాటల యుద్ధం ఘర్షణ వాతావరణం ఏర్పడింది.తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారని గలాటా చోటు చేసుకుంది. పోలీసులు మాత్రం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మీడియా పాయింట్ వద్దకు ఎమ్మెల్యే మనోహర్ అనుచరులతో కలిసి వెళ్లి మాట్లాడారని సమాధానం ఇచ్చారు. తమను కూడా లోపలికి పంపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తాండూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు మరో ఎనిమిది మంది పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు మణికొండలో ఉన్న ఆయన నివాసం వద్దకు తాండూరు, వికారాబాద్ కు చెందిన పోలీసులు భారీగా ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో నిరీక్షిస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి ఉంచారు. పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీడియోలు తీస్తున్న తమ సెల్ ఫోన్లు లాక్కున్నారని అనుచరులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.