తాండూరు ‘ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ’!

తాండూరు ‘ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ’!
బంటు వేణు చివరి వరకు ప్రయత్నం
సయోధ్య కుదిర్చిన ఎమ్మెల్యే
నీరజకు లైన్ క్లియర్
చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం
వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్
భారీ ఏర్పాట్లలో బిజీబిజీ
నెరవేరిన సాయిపూర్ వాసుల కల

తాండూరు ప్రథమ మహిళగా కాంగ్రెస్ పార్టీ నుండి 12 వ వార్డు నుండి భారీ మెజార్టీతో ఎన్నికైన పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి చైర్ పర్సన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 36 వార్డులకు గాను కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకొంది. బీసీ జనరల్ కు చైర్మన్ స్థానం రిజర్వు అయ్యింది. చైర్మన్ పదవి కోసం మూడుసార్లు గెలిచిన 12 వ వార్డు నుండి కౌన్సిలర్ మున్నూరు కాపు మహిళా నేత పట్లోళ్ల నీరజ తో పాటు, అదే పార్టీకి చెందిన 909 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన యవనేత,ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 11 వ వార్డు కౌన్సిలర్ బంటు వేణుగోపాల్ ల మధ్య చైర్మన్ పదవి దోబూచులాడింది. ఇప్పటికే నీరజ భర్త బాల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతుండగా అన్ని పదవులు వారికేనా అని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నీరజ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

ఇప్పటికే గెలిచిన 19 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులోని ఓ హోటల్లో క్యాంపు ఏర్పాటు చేసింది.ఈ క్యాంప్ లోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకాభిప్రాయం ద్వారాచివరకు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ , మైనార్టీ కోటాలో వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ లను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చేపట్టనున్న ప్రమాణ స్వీకారం లో సీల్డ్ కవర్ ద్వారా పై ఇద్దరి పేర్లు ప్రకటించనున్నారు. ఇప్పటికే నీరజకు ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అనుచరుగణం రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లలో బిజీ బిజీ అయింది.

నెరవేరిన సాయిపూర్ వాసుల కల

సాయి పూర్ కు చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొన్నేళ్లుగా తమ ప్రాంతవాసి తాండూరు మున్సిపల్ పిఠాన్ని అధిరోహించాలన్న సాయిపూర్ వాసుల కల రేపటితో నెరవేరనుంది.

తాండూరు ‘ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ’!

తాండూరు 'ప్రథమ మహిళ గా పట్లోళ్ల నీరజ'!

🗓 16 Feb 2026 | 09:03 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top