తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా..పట్లోళ్ల నీరజ ప్రమాణస్వీకారం
వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్
బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాక్ ఔట్
ప్రమాణ స్వీకారం చేయకుండానే వెళ్లిపోయిన బిజెపి కౌన్సిలర్లు
హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ ను మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమైన సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది.వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజ చైర్ పర్సన్ గా పదవి ప్రమాణస్వీకారం చేశారు. అదే పార్టీకి చెందిన 29వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. కౌన్సిల్ హాల్ కు వచ్చిన 11 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ నేతలపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా చైర్మన్ ప్రమాణస్వీకారాన్ని వాక్ అవుట్ చేస్తూ వెళ్లిపోయారు. మరోవైపు కౌన్సిల్ కు వచ్చిన బిజెపి కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం లేకుండానే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

మరింత అభివృద్ధిగా కృషి చేస్తాం
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని కట్టబెట్టి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేలా మద్దతు ఇచ్చారన్నారు…
సీఎం రేవంత్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు…
అట్టి నిధులతో తాండూరును మరింత అభివృద్ధి చేస్తానన్నారు…బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు…

తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా..పట్లోళ్ల నీరజ ప్రమాణస్వీకారం
తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా..పట్లోళ్ల నీరజ ప్రమాణస్వీకారం
వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్
బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాక్ ఔట్
ప్రమాణ స్వీకారం చేయకుండానే వెళ్లిపోయిన బిజెపి కౌన్సిలర్లు
హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ ను మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమైన సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది.వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజ చైర్ పర్సన్ గా పదవి ప్రమాణస్వీకారం చేశారు. అదే పార్టీకి చెందిన 29వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. కౌన్సిల్ హాల్ కు వచ్చిన 11 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ నేతలపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా చైర్మన్ ప్రమాణస్వీకారాన్ని వాక్ అవుట్ చేస్తూ వెళ్లిపోయారు. మరోవైపు కౌన్సిల్ కు వచ్చిన బిజెపి కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం లేకుండానే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
మరింత అభివృద్ధిగా కృషి చేస్తాం
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీని కట్టబెట్టి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేలా మద్దతు ఇచ్చారన్నారు...
సీఎం రేవంత్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు...
అట్టి నిధులతో తాండూరును మరింత అభివృద్ధి చేస్తానన్నారు...బిఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు...