ఎందుకిలా.. ఎన్నికల నిబంధన అందరికా .. కొందరికా!
అధికార సభ్యులకు కుర్చీ వద్దకు కార్ అనుమతి
ప్రతి పక్ష పార్టీల,నాయకుల విలేకరులపట్ల వివక్ష చర్చనీయాంశమైన పోలీసుల వ్యవహారం.!
జిల్లా బాస్ క్రింది స్థాయి అధికారుల పై దృష్టి సారించాలని విజ్ఞప్తులు

వికారాబాద్:..తెలంగాణ రాష్ట్రము లో నిర్వహించిన ఎన్నికల నిబంధనలు జిల్లాల, పోలీస్ డివిజన్ల వారీగా వేరు -వేరు గా అమలుచేస్తారా అంటూ వికారాబాద్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం ప్రాంగణంలో చోటు చేసుకున్న సంఘటనలు ఈ సంశయానికి తెరలేపింది. ఎన్నికలన నియమావాళి రాష్ట్రమంతా ఒకే విధానంలో పరిపాలన అమలుచెయాలి వికారాబాద్ పోలీసులు మున్సిపల్ ప్రధాన ప్రహరీ గేటు వద్ద పోలీసులు అభ్యర్థులను ప్రమాణ స్వీకారం భవనము లోనికి 150 మీటర్ల దూరంలో చెక్కింగ్ చేపట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన సభ్యులను వారి -వారి వాహనాల్లో చెక్కింగ్ చేయకుండానే ప్రమాణం స్వకారం భవనము గుమ్మము వరకు వెళ్ళినారని, ప్రతిపక్షాలు బిఆర్ఎస్, బీజేపీ సభ్యులకు ప్లాహరి గేటు బయట నే వాహనాలను నిలిపివేసి, ఐడి ఫ్రూఫ్ లు చూపించాలని, ఏపార్టీ మీది, ఎక్కడ నివసిస్తారు అంటూ అసంబంధ ప్రశ్నలతో కాలయాపణ చేశారు. మహిళా సభ్యులను క్యూలో రావాలంటూ ఆదేశిస్తూ అనవసర రాధాంతం చేశారు. ఆదేశమయంలో వార్తలు సేకరించడానికి వచ్చిన పాత్రికేయులను అడ్డగించి మీకు అనుమతి లేదంటూ ఇక్కడినుండి వెళ్లాలని ఆదేశించారు.ప్రతి పక్ష పార్టీల,నాయకుల విలేకరులపట్ల వివక్ష చర్చనీయాంశమైనది. జిల్లా ఉన్నతస్థాయి అధికారి ఈ విషయంలో క్రింది స్థాయి అధికారుల వ్యవహారం పై దృష్టి సరించాలని, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ సభ్యులు, జిల్లా పాత్రికేయ సంఘాల నాయకులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎన్నికల నిభందనలు ఒక్కేటే విధంగా ఉండాలి కదా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో విలేకరులను ప్రమాణ ప్రాంగణం లోకి /సభ్యుల సమావేశం హలులోకి అనుమతి స్తె పోలీసులు ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారని పోలీసులను ప్రశ్నించారు. అక్కడ ఇవ్వొచ్చు ఇక్కడ కుదరదు అంటూ పోలీసులు సమాధానం ఇవ్వడంతో పాత్రికేయులు రోడ్డు పై నిరసనలుతెలిపారు.సమావేశానికి ముఖ్య అతిథిగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరుకాగా, అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాన్వాయ్‌తో లోపలికి వెళ్లినట్లు సమాచారం. అయితే అనంతరం కార్యక్రమాన్ని కవర్ చేయడానికి
వచ్చిన మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతి లేదంటూ నిరకరించడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారిచేశారా అని వాపోయారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
“ఫార్త్ ఎస్టేట్ పరువు తీస్తున్న పాలక వర్గాలు”
నాడు బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభానికి కాలం చెల్లినట్లేనా అంటూ విద్యావేత్తలు, పరిశీలకులు, సీనియర్ పాత్రికేయులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పత్రికలు పాలకులకు ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ ఇటు క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలు గుర్తించి పాలక వర్గాలకు, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం మార్గాన్ని చూపే పాత్రికేయుల పట్ల అధికారం చేతిలో ఉన్నప్పుడు దండనలు, ఓడినప్పుడు మద్దతుకోసం పొగడటం పరిపాటిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో కళం సైనికులని, మీ పోరాట త్యాగం మరువమని పొగిడిన కేసీఆర్ అధికారం చేపట్టాక కంటి తుడుపుగా విధినిర్వహణలో అక్రీడేషన్ ఉన్నవారు. మృతికి లక్ష రూపాయలు ఇచ్చారు. సాధారణ అధికార సమావేశాల్లో పాల్గొన వద్దనే నియంత మాదిరిగా నిభందనాలు విధించారు. అప్పట్లో కాంగ్రెస్ భాస్ గా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అదే పాత చింతకాయ పచ్చడి కేసీఆర్ చెప్పినట్టు మాటలు చెప్పాడు. పాత్రికేయులకు వారి -వారి సంస్థల ద్వారా జీతాలు ఇప్పిస్తా అన్నారు. మరిచిపోయారు. అధికారం రాగానే పోర్త్ ఎస్టేట్ ను కాపాడుతా అంటూనే అందులో పనిచేసే విలేకరుల నడ్డివిరిసే జిఓ లు, చట్టాలను అమలు పరచిన సంఘటనలు జరిగాయి. తాజాగా మున్సిపల్ సాధారణ సమావేశం లో అంత గొప్యత గల అంశాలు ఏమీ ఉన్నాయని ప్రశ్నలు తేలేత్తు తున్నాయి. విలేకరులు అంటే అనుసంధానం చేసే సామాన్య వ్యక్తులుగా పరిగనించాలి కానీ, దేశ రక్షణ సమాచారం ఇతర దేశాలకు చేరవిశే గుడాచారుల గా ప్రభుత్వాలు పరిగణించడం బాధకల్గిస్తున్న అంశమని పాత్రికేయులు మదన పడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలోచించి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలు, జిల్లా సమీక్షా సమావేశాలు కలెక్టర్, ఎస్పీ లు నిర్వహించే సాధారణ సమావేశాలకు అనుమతులు కల్పించాలని పత్రికా, మీడియా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

"ఫార్త్ ఎస్టేట్ పరువు తీస్తున్న పాలక వర్గాలు"