తాండూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు*

*తాండూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు*

*బీఆర్ఎస్ నాయకులను ఆరోపణలను ఖండించిన యాలాల కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అక్బర్ బాబా*

తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేకనే యాలాల బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని యాలాల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అక్బర్ బాబా అన్నారు. బుయ్యని సోదరులపై గురువారం యాలాల బీఆర్ఎస్ మండల నాయకులు చేసిన ఆరోపణలను అక్బర్ బాబా ఖండించారు . ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక మతి లేకుండా బీ. ఆర్. ఎస్ నాయకులు  మాట్లాడుతున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల పేరిట ఇసుక అక్రమ రవాణాకు పాల్పడింది బీఆర్ఎస్ నాయకులని అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇంటి నిర్మాణానికి టిప్పర్లతో ఇసుకను అక్రమంగా తరలించుకుపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్బీఓఎల్ కంపెనీ తరపున ప్రతి ఏడాది రూ.3 లక్షల రూపాయలను భారత సైన్యానికి కేటాయిస్తున్న ఎమ్మెల్యే సోదరుడిపై నిందలు వేయడం తగదన్నారు. ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అక్బర్ బాబా ఈ సందర్బంగా హెచ్చరించారు.

🗓 27 Feb 2026 | 03:40 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top