ప్రతి ప్రాణం విలువైనది, రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం ప్రాణాంతకం,..
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పు అని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు.తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘అరైవ్ – అలైవ్ (Arrive Alive)’ అనే పేరు తో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో భారీ రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై అవగాహనా కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.వికారాబాద్ పరిధిలోని వివిధ రవాణా సంఘాలకు చెందిన డ్రైవర్లకు ప్రముఖ కంటి ఆసుపత్రి మాక్స్ విజన్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేశారు. డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణే రహదారి భద్రతకు మూలమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
అనంతరం ఏర్పాటుచేసిన సదస్సులో
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ,
ప్రతి పౌరుడు క్షేమంగా తన గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతోనే ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు అనాథలవుతున్నాయని, ముఖ్యంగా వృత్తిపరమైన డ్రైవర్లు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కంటి చూపు పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
“నిద్రలేమి, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడమే మెజారిటీ రోడ్డు ప్రమాదాలకు కారణం అన్నారు. వాహనం నడిపే సమయంలో క్రమశిక్షణ పాటిస్తే మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడగలము” అని డ్రైవర్లను ఉద్దేశించి తెలిపారు.
కంటి చూపులో లోపాలు ఉన్న డ్రైవర్లకు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని, అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సూచించిన కళ్లజోడులను తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు.అంతకుముందు అవగాహన సదస్సులో భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, డి ఎస్ పి శ్రీనివాస్ రెడ్డి, సీఐ రఘు కుమార్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.