*విద్యుత్ షాక్ తో మహిళ మృతి*
*యాలాల మండలం రాస్నాం గ్రామం లో ఘటన*
*యాలాల.*.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నాం గ్రామం లో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. యాలాల ఎస్సై విఠల్ తెలిపిన వివరాల ప్రకారం రాస్నాం గ్రామానికి చెందిన మక్త శశికళ భర్త మంజునాథ్ వయస్సు 34.వృత్తి వ్యవసాయం. ఆదివారం సాయంత్రం అందాజ సాయంత్రం 7 గంటల 30 నిముషాలకు తాము నిర్మించుకుంటున్న నూతన ఇంటి వద్ద ఇంటి గోడలకు డ్రమ్ములలో నిలువ ఉంచిన నీటిని సింగిల్ ఫేజ్ మోటార్ బిగించి నీళ్లను పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మరణించిందని మృతురాలి భర్త మంజునాథ్ తెలిపాడు. మృతురాలి భర్త మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాలాల ఎస్సై విఠల్ తెలిపారు. ఈ సందర్బంగా యాలాల ఎస్సై విఠల్ మాట్లాడుతూ విద్యుత్ సంబంధిత పనులలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని ఎస్సై సూచించారు.
*విద్యుత్ షాక్ తో మహిళ మృతి* …. *యాలాల మండలం రాస్నాం గ్రామం లో ఘటన*