సహారా ఏజెంట్ల ఆవేదన… – నమ్మి డబ్బులు కట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం

సహారా ఏజెంట్ల ఆవేదన…
– నమ్మి డబ్బులు కట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం
– ఉపాధి లేకపోగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం
– పార్లమెంట్ లో మా సమస్యని లేవనెత్తి ఉపశమనం కల్పించండి
– చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి సహారా ఏజెంట్ల వినతిపత్రం

వికారాబాద్:సహారా ఇండియా పరివార్‌లో పెట్టుబడుల గడువు ముగిసినా డబ్బులు రాకపోవడంతో, బాధితుల నుంచి ఏజెంట్లు తీవ్ర ఒత్తిడి, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ నుంచి స్పష్టత లేకపోవడం, కోర్టు కేసుల పేరుతో నిధులు నిలిచిపోవడంతో తమను నమ్మి డబ్బులు కట్టిన వారిని సమాధానపరచలేక ఏజెంట్లు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.ఇదే విషయమై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పనిచేసే సహారా ఏజెంట్లు శనివారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రం అందజేశారు. గత 20 సంవత్సరాలుగా సహారా లో ఏజెంట్లుగా పనిచేస్తున్నామని, కస్టమర్ల దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేసి సహారా లో పెట్టించడం జరిగింది. కానీ ఆ డబ్బులు గత రెండు సంవత్సరాల నుండి రావడం లేదు. దీంతో ఏజెంట్లమైన తాము కస్టమర్ల దగ్గరికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాము. డబ్బులు ఇప్పించకపోవడం చేత కస్టమర్లు ఇంటి వద్దకు వచ్చి బూతులు తిడుతున్నారని, అంతేగాక మాకు ఉపాధి లేక మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయని సహారా ఏజెంట్లు వాపోయారు. ఇప్పటికే మానసిక ఒత్తిడి కారణంగా ఇద్దరు ఏజెంట్లు మరణించారని, కావున మా మొరను ఆలకించి పార్లమెంట్ సమావేశాల్లో మా సమస్యని లేవనెత్తి సహార డబ్బులు కస్టమర్లకు రిఫండ్ వచ్చే విధంగా కృషిచేసి తాము ఎదుర్కొంటున్న సమస్య నుంచి గట్టెక్కించాలని సహారా ఏజెంట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరారు.

సహారా ఏజెంట్ల ఆవేదన… – నమ్మి డబ్బులు కట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం

సహారా ఏజెంట్ల ఆవేదన...
- నమ్మి డబ్బులు కట్టిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం
- ఉపాధి లేకపోగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం
- పార్లమెంట్ లో మా సమస్యని లేవనెత్తి ఉపశమనం కల్పించండి
- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి సహారా ఏజెంట్ల వినతిపత్రం

వికారాబాద్:సహారా ఇండియా పరివార్‌లో పెట్టుబడుల గడువు ముగిసినా డబ్బులు రాకపోవడంతో, బాధితుల నుంచి ఏజెంట్లు తీవ్ర ఒత్తిడి, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ నుంచి స్పష్టత లేకపోవడం, కోర్టు కేసుల పేరుతో నిధులు నిలిచిపోవడంతో తమను నమ్మి డబ్బులు కట్టిన వారిని సమాధానపరచలేక ఏజెంట్లు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.ఇదే విషయమై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పనిచేసే సహారా ఏజెంట్లు శనివారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యపై వినతి పత్రం అందజేశారు. గత 20 సంవత్సరాలుగా సహారా లో ఏజెంట్లుగా పనిచేస్తున్నామని, కస్టమర్ల దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేసి సహారా లో పెట్టించడం జరిగింది. కానీ ఆ డబ్బులు గత రెండు సంవత్సరాల నుండి రావడం లేదు. దీంతో ఏజెంట్లమైన తాము కస్టమర్ల దగ్గరికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాము. డబ్బులు ఇప్పించకపోవడం చేత కస్టమర్లు ఇంటి వద్దకు వచ్చి బూతులు తిడుతున్నారని, అంతేగాక మాకు ఉపాధి లేక మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు దాపురించాయని సహారా ఏజెంట్లు వాపోయారు. ఇప్పటికే మానసిక ఒత్తిడి కారణంగా ఇద్దరు ఏజెంట్లు మరణించారని, కావున మా మొరను ఆలకించి పార్లమెంట్ సమావేశాల్లో మా సమస్యని లేవనెత్తి సహార డబ్బులు కస్టమర్లకు రిఫండ్ వచ్చే విధంగా కృషిచేసి తాము ఎదుర్కొంటున్న సమస్య నుంచి గట్టెక్కించాలని సహారా ఏజెంట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరారు.

🗓 15 Mar 2026 | 09:27 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top