పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారo చేయాలి
పాత పద్దతి(గ్రీన్ ఛానల్ )ప్రకారం కార్మికుల ఖాతాలో నేరుగా వేతనాలు వెయ్యాలి*
జిల్లా సీఐటీయూ నాయకులు బుగ్గప్ప డిమాండ్
యాలాల…*. వికారాబాద్ జిల్లా యాలాల మండల తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు )ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారo చేయాలని, కార్మికుల వేతనాలు నేరుగా వారి ఖాతా(గ్రీన్ ఛానల్)ద్వారా నే వేయాలని యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం యాలాల మండలం ఎంపీడీఓ కృష్ణా రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా నాయకులుయు.బుగ్గప్పమాట్లాడుతూ…గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 సంవత్సరాలుగా పనిచేసిన సరియైన సమయానికి వేతనాలు రాని పరిస్థితి పంచాయతీ కార్మికులు పస్తులుండి అప్పుల పాలవుతూ దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల పని ఒత్తిడి పెరిగి అనేక మంది కార్మికుల చనిపోయిన దుస్థితి ఉందని అన్నారు.గత నాలుగు నెలలుగా వేతనాలు కార్మికులకు అందక ఇబ్బందులు పడుతున్నారని మార్చి రెండవ తేదీన సర్పంచులే వేతనాలు చెల్లిస్తారని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారని ఈ విధానం వల్ల గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక పోరాటాల ఫలితంగా టీఎస్పీ బిపాస్ ద్వారా వేతనాలు చెల్లించారని సిబ్బందికి వేతనాలు అందరిని పరిస్థితిలో స్వయంగా ముఖ్యమంత్రి గారే 2025 జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాకపోవడం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ మేనిఫెస్టోలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు కాకపోవడం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని కొనసాగించడం ఈ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల దుర్భరంగా వ్యవహరిస్తున్నది అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51 సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గతంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలను అమలు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్ లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని పంచాయతీలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని రెండో పిఆర్సి పరిధిలోకి కార్మికులను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పంచాయతీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని దహన ఖర్చులను నిమిత్తం ఉన్నటువంటి 10000 రూపాయలు కాకుండా 30 వేల రూపాయలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన అమలు చేయాలని లేనిచో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పంచాయతీ కార్మిక వర్గం అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు హరీఫ్, షేబ్బర్,చంద్రప్ప,లాలప్ప,ఆనందం,శివకుమార్,చంద్రమ్మ, లక్ష్మి,సరస్పతి,సాయిలు నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారo చేయాలి*
పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారo చేయాలి
పాత పద్దతి(గ్రీన్ ఛానల్ )ప్రకారం కార్మికుల ఖాతాలో నేరుగా వేతనాలు వెయ్యాలి*
జిల్లా సీఐటీయూ నాయకులు బుగ్గప్ప డిమాండ్
యాలాల...*. వికారాబాద్ జిల్లా యాలాల మండల తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు )ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారo చేయాలని, కార్మికుల వేతనాలు నేరుగా వారి ఖాతా(గ్రీన్ ఛానల్)ద్వారా నే వేయాలని యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం యాలాల మండలం ఎంపీడీఓ కృష్ణా రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా నాయకులుయు.బుగ్గప్పమాట్లాడుతూ...గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 సంవత్సరాలుగా పనిచేసిన సరియైన సమయానికి వేతనాలు రాని పరిస్థితి పంచాయతీ కార్మికులు పస్తులుండి అప్పుల పాలవుతూ దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల పని ఒత్తిడి పెరిగి అనేక మంది కార్మికుల చనిపోయిన దుస్థితి ఉందని అన్నారు.గత నాలుగు నెలలుగా వేతనాలు కార్మికులకు అందక ఇబ్బందులు పడుతున్నారని మార్చి రెండవ తేదీన సర్పంచులే వేతనాలు చెల్లిస్తారని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారని ఈ విధానం వల్ల గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక పోరాటాల ఫలితంగా టీఎస్పీ బిపాస్ ద్వారా వేతనాలు చెల్లించారని సిబ్బందికి వేతనాలు అందరిని పరిస్థితిలో స్వయంగా ముఖ్యమంత్రి గారే 2025 జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాకపోవడం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ మేనిఫెస్టోలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు కాకపోవడం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని కొనసాగించడం ఈ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల దుర్భరంగా వ్యవహరిస్తున్నది అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51 సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గతంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలను అమలు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్ లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని పంచాయతీలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని రెండో పిఆర్సి పరిధిలోకి కార్మికులను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పంచాయతీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని దహన ఖర్చులను నిమిత్తం ఉన్నటువంటి 10000 రూపాయలు కాకుండా 30 వేల రూపాయలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన అమలు చేయాలని లేనిచో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పంచాయతీ కార్మిక వర్గం అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు హరీఫ్, షేబ్బర్,చంద్రప్ప,లాలప్ప,ఆనందం,శివకుమార్,చంద్రమ్మ, లక్ష్మి,సరస్పతి,సాయిలు నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
