కార్యకర్తలు అధైర్య పడకండి..
కడిగిన ముత్యంలా ‘పైలెట్ బయటికోస్తడు’ !
కేసులో కాంగ్రెస్ కుట్ర
బీఆర్ఎస్ యువనేత కోట్ల మహేశ్వర్ రెడ్డి వెల్లడి

ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా డ్రగ్స్ కేసు నుండి ‘పైలెట్’ కడిగిన ముత్యంలా బయటికి వస్తాడని, కార్యకర్తలు అధైర్య పడవద్దని బీఆర్ఎస్ యాలాల మండల యువనేత కోట్ల మహేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్నిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా తమ నేత మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని డ్రగ్స్ కేసులో ఇరికించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా .. మూసి సుందరీకరణ, హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ లకు పాల్పడుతుందని విమర్శించారు. రేపు తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి నాయకులు , కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్అన్నకు పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ అండగా నిలవాలని మహేశ్వర్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
కార్యకర్తలు అధైర్య పడకండి..
కార్యకర్తలు అధైర్య పడకండి..
కడిగిన ముత్యంలా 'పైలెట్ బయటికోస్తడు' !
కేసులో కాంగ్రెస్ కుట్ర
బీఆర్ఎస్ యువనేత కోట్ల మహేశ్వర్ రెడ్డి వెల్లడి
ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా డ్రగ్స్ కేసు నుండి 'పైలెట్' కడిగిన ముత్యంలా బయటికి వస్తాడని, కార్యకర్తలు అధైర్య పడవద్దని బీఆర్ఎస్ యాలాల మండల యువనేత కోట్ల మహేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్నిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా తమ నేత మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని డ్రగ్స్ కేసులో ఇరికించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా .. మూసి సుందరీకరణ, హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ లకు పాల్పడుతుందని విమర్శించారు. రేపు తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి నాయకులు , కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్అన్నకు పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ అండగా నిలవాలని మహేశ్వర్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
