రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ కేసు బోగస్‌

రోహిత్ రెడ్డి ఇమేజ్‌ పై కుట్ర…. బీఆర్ఎస్ సంచలనం

రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ కేసు బోగస్‌

వ్యక్తిగత ఆరోపణలు ఆపాలని డిమాండ్

షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తామన్న నేతలు

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం

మీడియా సమావేశంలోతాండూరు బీఆర్ఎస్ నేతలు

తాండూరులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
పైలట్ ఇమేజ్‌ ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు.రోహిత్ రెడ్డి పై నమోదైన డ్రగ్స్ కేసు పూర్తిగా బోగస్ అంటూ తీవ్రంగా ఖండించారు. బుధవారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, నేతలు పట్లోళ్ల నర్సింలు, శోభారాణి,
నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు మాట్లాడుతూ..

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నమోదైన డ్రగ్స్ కేసు చుట్టూ కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ అన్నారు.ఈ నెల 15న జరిగిన ఘటనకు సంబంధించి 14వ తేదీనే ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం పలు సందేహాలకు తావిస్తోంది అనినేతలువ్యాఖ్యానించారు. డ్రగ్స్, తుపాకీ కాల్పుల కేసులలో సెక్షన్లు మారుస్తూ ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని ఆరోపించారు.తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి ఇమేజ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీపై కూడా మచ్చ వేయాలనే ప్రయత్నాలుజరుగుతున్నాయనివిమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు, కిట్ల పంపిణీ అన్నీ వారి ఆధీనంలోనే ఉన్నాయని, అందుకేకేసునమోదుపైఅనుమానాలువ్యక్తమవుతున్నాయని అన్నారు. తాండూరు లోకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, అక్రమ కార్యకలాపాల కేసులు పెరిగాయని ఆరోపించారు.
రోహిత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, రాజకీయాల్లో అలాంటి వ్యాఖ్యలు తగవని సూచించారు. హుందాగా వ్యవహరించాలని కోరారు…ఇదిలా ఉంటే, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను దాచిపెట్టేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మున్సిపల్‌లో మూడోసారి ప్రజాపాలన కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారి అయినా సరైన నిధులు వచ్చాయా అని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. తక్కువ విద్యావంతులు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇక కేసు పరిణామాలపై మాట్లాడుతూ, రోహిత్ రెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తామని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. రోహిత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసులో రీ-టెస్టింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, చివరికి రోహిత్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ కేసు బోగస్‌

రోహిత్ రెడ్డి ఇమేజ్‌ పై కుట్ర.... బీఆర్ఎస్ సంచలనం

రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ కేసు బోగస్‌

వ్యక్తిగత ఆరోపణలు ఆపాలని డిమాండ్

షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తామన్న నేతలు

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం

మీడియా సమావేశంలోతాండూరు బీఆర్ఎస్ నేతలు

తాండూరులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
పైలట్ ఇమేజ్‌ ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు.రోహిత్ రెడ్డి పై నమోదైన డ్రగ్స్ కేసు పూర్తిగా బోగస్ అంటూ తీవ్రంగా ఖండించారు. బుధవారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, నేతలు పట్లోళ్ల నర్సింలు, శోభారాణి,
నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు మాట్లాడుతూ..

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నమోదైన డ్రగ్స్ కేసు చుట్టూ కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ అన్నారు.ఈ నెల 15న జరిగిన ఘటనకు సంబంధించి 14వ తేదీనే ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం పలు సందేహాలకు తావిస్తోంది అనినేతలువ్యాఖ్యానించారు. డ్రగ్స్, తుపాకీ కాల్పుల కేసులలో సెక్షన్లు మారుస్తూ ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని ఆరోపించారు.తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి ఇమేజ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీపై కూడా మచ్చ వేయాలనే ప్రయత్నాలుజరుగుతున్నాయనివిమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు, కిట్ల పంపిణీ అన్నీ వారి ఆధీనంలోనే ఉన్నాయని, అందుకేకేసునమోదుపైఅనుమానాలువ్యక్తమవుతున్నాయని అన్నారు. తాండూరు లోకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, అక్రమ కార్యకలాపాల కేసులు పెరిగాయని ఆరోపించారు.
రోహిత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, రాజకీయాల్లో అలాంటి వ్యాఖ్యలు తగవని సూచించారు. హుందాగా వ్యవహరించాలని కోరారు...ఇదిలా ఉంటే, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను దాచిపెట్టేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మున్సిపల్‌లో మూడోసారి ప్రజాపాలన కొనసాగుతున్నప్పటికీ ఒక్కసారి అయినా సరైన నిధులు వచ్చాయా అని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. తక్కువ విద్యావంతులు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇక కేసు పరిణామాలపై మాట్లాడుతూ, రోహిత్ రెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తామని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. రోహిత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసులో రీ-టెస్టింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, చివరికి రోహిత్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

🗓 18 Mar 2026 | 06:50 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top