వేసవికి ముందే విద్యుత్ కట్ కట !
-అర్ధరాత్రి వేళ విద్యుత్ కోతలు
-సమస్య పరిష్కారం కోసం స్పందించని విద్యుత్ శాఖ
తనకేం సంబంధం లేదంటున్న లైన్ ఇన్స్పెక్టర్
-తాగునీటి కోసం ప్రజల తిప్పలు

వేసవికి ముందే విద్యుత్ కట్ కట ! —అర్ధరాత్రి వేళ విద్యుత్ కోతలు
వేసవికి ముందే విద్యుత్ కట్ కట !
-అర్ధరాత్రి వేళ విద్యుత్ కోతలు
-సమస్య పరిష్కారం కోసం స్పందించని విద్యుత్ శాఖ
తనకేం సంబంధం లేదంటున్న లైన్ ఇన్స్పెక్టర్
-తాగునీటి కోసం ప్రజల తిప్పలు
తాండూరు మార్చ్ 23 ( స్పీడ్ న్యూస్):-విద్యుత్ కోతలతో జనం విలవిలలాడుతున్నారు. దీంతో విద్యుత్ కోతలు జఠిలంగా మారాయి. ఒక పక్క తీవ్ర ఉష్ణోగ్రతలు, మరో పక్క అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు మంచినీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కోతల సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గాఢ నిద్రలోకి వెళ్ళగానే అర్థరాత్రి వేళ కోతల పర్వం మొదలుపెట్టారు. విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ కోతలపై ప్రశ్నించిన వినియోగదారులకు కొందరు విద్యుత్ శాఖ అధికారులు తనకేం తెలియదంటూ దాటవేసే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. తాండూరు పట్టణానికి అతి సమీపంలో ఉన్న అంతారం గ్రామంలో విద్యుత్ కోతల సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది.అప్రకటిత విద్యుత్ కోతలు రాత్రి సమయాల్లో కూడా విధించడం వల్ల జనం నిద్రకు దూరమవుతున్నారు. లైన్మెన్ స్పందించినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు లైన్ ఇన్స్పెక్టర్ మొదలుకొని ఏఈ, డిఈ వరకు కూడా ఎవ్వరు స్పందించే పరిస్థితిలో లేరని స్థానిక వినియోధాలు చెప్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రజలు. ఇలాగే కొనసాగితే వేసవిలో మరింత కోతలు తప్పవేమోనని అనుమానిస్తున్నారు .ఎటువంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
