మున్సిపల్ సమావేశం నిర్వహించేదెప్పుడో..?
– వికారాబాద్ పట్టణ ప్రజల్లో ఇదే చర్చ
– నేడు తేదీని నిర్ణయిస్తాం: కమిషనర్ విక్రమసింహారెడ్డి
వికారాబాద్: జిల్లా కేంద్రమైన వికారాబాద్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. రెండు లక్షల పైచిలుకు జనాభా కలిగిన వికారాబాద్ మున్సిపాలిటీ గత ఏడాదిన్నరగా పాలకవర్గం లేక ఇలాంటి అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం కొత్త పాలకవర్గం ఏర్పడి నెల పైనే గడుస్తున్న సమావేశం జరగకపోవడం పట్ల పట్టణ ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలోని పరిగి, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీలలో మొదటి కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పటికీ, వికారాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశానికి జాప్యం ఎందుకు జరుగుతుందోనని పట్టణవాసుల్లో చర్చ జరుగుతుంది. అయితే కౌన్సిల్ సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల దిశగా అడుగులు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఇందుకు సంబంధించి వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని వివరాల కోరగా… నేడు సోమవారం చైర్మన్ తో సమావేశమై కౌన్సిల్ సమావేశం నిర్వహణకు సంబంధించి తేదీని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
మున్సిపల్ సమావేశం నిర్వహించేదెప్పుడో..? — వికారాబాద్ పట్టణ ప్రజల్లో ఇదే చర్చ
మున్సిపల్ సమావేశం నిర్వహించేదెప్పుడో..?
- వికారాబాద్ పట్టణ ప్రజల్లో ఇదే చర్చ
- నేడు తేదీని నిర్ణయిస్తాం: కమిషనర్ విక్రమసింహారెడ్డి
వికారాబాద్: జిల్లా కేంద్రమైన వికారాబాద్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. రెండు లక్షల పైచిలుకు జనాభా కలిగిన వికారాబాద్ మున్సిపాలిటీ గత ఏడాదిన్నరగా పాలకవర్గం లేక ఇలాంటి అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం కొత్త పాలకవర్గం ఏర్పడి నెల పైనే గడుస్తున్న సమావేశం జరగకపోవడం పట్ల పట్టణ ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలోని పరిగి, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీలలో మొదటి కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పటికీ, వికారాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశానికి జాప్యం ఎందుకు జరుగుతుందోనని పట్టణవాసుల్లో చర్చ జరుగుతుంది. అయితే కౌన్సిల్ సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల దిశగా అడుగులు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఇందుకు సంబంధించి వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని వివరాల కోరగా... నేడు సోమవారం చైర్మన్ తో సమావేశమై కౌన్సిల్ సమావేశం నిర్వహణకు సంబంధించి తేదీని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
