పోటీ పరీక్షలకు ప్రణాళిక , సాధనతోనే విజయం సాధ్యం–RBOL ఎండీ సరళ శ్రీనివాస్ రెడ్డి

సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఉచిత EAPCET కోచింగ్ ప్రారంభం

ప్రణాళిక, సాధన, ఏకాగ్రతతోనే విజయం సాధ్యం అవుతుందని ఆర్బీఓ ల్ ఎండీ సరళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారంతాండూర్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత EAPCET కోచింగ్ తరగతులుప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RBOL ఎండీ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సరళ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులు గురువుల మార్గదర్శకత్వంలో నిర్దిష్ట ప్రణాళికతో పాటు క్రమబద్ధమైన సాధన చేస్తే పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధించవచ్చని అన్నారు. కేవలం మార్కుల కోసం కాకుండా, విషయ పరిజ్ఞానం పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.
అభ్యాసమే మనిషిని పరిపూర్ణునిగా తీర్చిదిద్దుతుందని, విద్యార్థులు ఏకాగ్రతతో చదివి విద్యా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.గత సంవత్సరం తాండూరులో హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించిన కోచింగ్ ద్వారా అనేక మంది విద్యార్థినులు మంచి ర్యాంకులు సాధించి రాష్ట్రంలోని ప్రముఖ కళాశాలలో సీట్లు పొందడం ఆనందదాయకమని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా బాలికల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఇలాగే భవిష్యత్తులో మరిన్ని విద్యా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, వాటికి RBOL తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు కరణం పురుషోత్తం రావు, తాండూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జి. నరేందర్, EAPCET కోచింగ్ కన్వీనర్ పర్యాద రామకృష్ణ, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, వినోద్ జైన్, పటేల్ విజయ్ కుమార్, జయంత్, అధ్యాపకులు మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

పోటీ పరీక్షలకు ప్రణాళిక , సాధనతోనే విజయం సాధ్యం--RBOL ఎండీ సరళ శ్రీనివాస్ రెడ్డి

🗓 23 Mar 2026 | 03:15 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top