మూగబోయిన కళాకారుడి జీవితం… డాన్సర్ అశోక్ కుమార్ కన్నుమూత
తాండూర్‌లో గుండెపోటుతో మృతి చెందిన ప్రతిభావంత కళాకారుడు
చిన్న డాన్స్ స్కూల్ నుంచి సినీ రంగం వరకు ఎదిగిన అశోక్ కుమార్
పోతురాజు, కూచిపూడి వేషాలతో ప్రేక్షకులను మెప్పించిన కళాకారుడు
జబర్దస్త్ కార్యక్రమాల్లోనూ తన ప్రతిభ చాటిన అశోక్
కళారంగానికి తీరని లోటు… సానుభూతి వెల్లువ

తాండూర్ నియోజకవర్గంలో ఒక ప్రతిభావంత కళాకారుడి జీవితం అకస్మాత్తుగా మూగబోయింది. ఉత్తమ అవార్డులు అందుకున్న ప్రముఖ డాన్సర్ అశోక్ కుమార్ గుండెపోటుతోకన్నుమూశారు.తాండూర్ పట్టణంలోని సీతారాంపేటలో నివాసముంటున్న అశోక్ కుమార్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.చిన్న డాన్స్ స్కూల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అశోక్ కుమార్, క్రమంగా ఫోటో, వీడియోగ్రఫీ రంగాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. విభిన్న కళారూపాల్లో నైపుణ్యం సాధించి, పోతురాజు, కూచిపూడి వంటి వేషాలతో ప్రేక్షకులను అలరించారు.
అలాగే ప్రముఖ టెలివిజన్ షో ‘జబర్దస్త్’ ఎపిసోడ్లలో కూడా పాల్గొని తన నటన, నృత్య ప్రతిభతో గుర్తింపు పొందారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టి తన ప్రతిభను మరింత విస్తరించారు.అశోక్ కుమార్ మరణం కళారంగానికి తీరని లోటుగా భావిస్తూ పలువురు ప్రముఖులు, స్నేహితులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.