వీరశైవ సమాజం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు
1061 ఓటర్లలో 855 మంది ఓటు హక్కు వినియోగం
80% భారీ పోలింగ్ నమోదు
ఉదయం మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ తరువాత జోరుగా కొనసాగింపు
భద్రేశ్వర దేవాలయంలో కోలాహలంగా ఓటింగ్
సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
గెలుపుకు సుమారు 300 ఓట్లు అవసరం అంచనా
వీరశైవ సమాజం ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1061 మంది ఓటర్లకు గాను 855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈ మేరకు మొత్తం పోలింగ్ శాతం 82 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగినా, అనంతరం ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఉత్సాహంగా ఓటు వేశారు. దీంతో మధ్యాహ్నానికి పోలింగ్ వేగం గణనీయంగా పెరిగింది.
ఈ ఎన్నికలు భద్రేశ్వర దేవాలయం ప్రాంగణంలో నిర్వహించగా, అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. ఓటింగ్ పూర్తయిన అనంతరం బైలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేసి భద్రపరిచారు.
ఇక సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. పోలింగ్ సరళిని బట్టి గెలుపు కోసం అభ్యర్థులు సుమారు 300 ఓట్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో సాయంత్రానికి అభ్యర్థుల భవితవ్యంపై స్పష్టత రానుంది.ఎన్నికల నిర్వహణలో సిబ్బంది కృషి విశేషంగా నిలిచింది. వారు ఎంతో శ్రమించి ఓటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. మొత్తం మీద వీరశైవ సమాజం ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎన్నికప్రధానఅధికారి-బి. నారాయణ సహాయ అధికారులు కే. ప్రకాష్, కె. సతీష్ కుమార్,వీ.సంగమేశ్వర, సి. రాజశేఖర్ మరియు పోలింగ్ సిబ్బంది. బి. సిద్ధరామేశ్వర్,బి. శివ ప్రసాద్, జి. బస్వరాజ్, ఎ .చంద్రశేఖర్, మల్లికార్జున, ఎల్. శివప్రసాద్, పి. శ్రీధర్,మహేశ్వరప్ప, హెచ్ . అనిల్ కుమార్,బి. ఉదయ్ కుమార్, బి. ప్రమోద్ మరియు సమాజ సిబ్బంది తదితరులు ఉన్నారు

వీరశైవ సమాజం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.. 1061 ఓటర్లలో 855 మంది ఓటు హక్కు వినియోగం
వీరశైవ సమాజం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు
1061 ఓటర్లలో 855 మంది ఓటు హక్కు వినియోగం
80% భారీ పోలింగ్ నమోదు
ఉదయం మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ తరువాత జోరుగా కొనసాగింపు
భద్రేశ్వర దేవాలయంలో కోలాహలంగా ఓటింగ్
సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
గెలుపుకు సుమారు 300 ఓట్లు అవసరం అంచనావీరశైవ సమాజం ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1061 మంది ఓటర్లకు గాను 855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈ మేరకు మొత్తం పోలింగ్ శాతం 82 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగినా, అనంతరం ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఉత్సాహంగా ఓటు వేశారు. దీంతో మధ్యాహ్నానికి పోలింగ్ వేగం గణనీయంగా పెరిగింది.