మహిళల భద్రతకు భరోసా షీ టీం

మహిళల భద్రతకు భరోసా షీ టీం

*కొకట్ గ్రామo లో ” షీ టీం” నిర్వహణ పై అవగాహన కార్యక్రమం*

*యాలాల్*.. మహిళలు చిన్నారులు ఆపదలో ఉన్నావారికి షి టీం అండగా ఉంటుందని షి టీం నిర్వాహకులు పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేషానుసారం తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో శుక్రవారం షీ టీం తాండూర్ ఇంచార్జి ఏ. ఎస్ . ఐ. చంద్రశేఖర్, మహిళా కానిస్టేబుల్ రోహిణి ఆధ్వర్యంలో కోకట్ గ్రామం లో షి టీం విధి నిర్వహణ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. యాలాల మండలం లోని కోకట్ లో ఉపాధి పనులు చేస్తున్న మహిళలు, కూలీలతో పోలీసు శాఖ నిర్వహిస్తున్న విధి నిర్వహణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మద్యానికి బానిస కారాదు అని, మహిళలకు సురక్షితమైన జీవితం, ఉండాలని వేధింపులు అరికట్టడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. చిన్నారులకు చదువుకునే విద్యార్థులకు సెల్ ఫోన్ అలవాటు చేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజు సరదాగా గడపాలని అన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అందరం బాగుటమని అన్నారు.సైబర్ క్రైమ్ 1930, మానసిక ఒత్తిడికి ఎవరైనా గురైతే 14416 కు సంప్రదిస్తే కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు. అలగే డయల్ 100 ,112 ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

కార్యక్రమంలో సర్పంచ్ , క్షేత్ర సహాయకులు, ఉపాధి కూలీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు భరోసా షీ టీం

మహిళల భద్రతకు భరోసా షీ టీం

*కొకట్ గ్రామo లో " షీ టీం" నిర్వహణ పై అవగాహన కార్యక్రమం*

🗓 01 May 2026 | 03:14 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top