మృగశిరకు మస్తు చేపలు
– వికారాబాద్ లో చేపలకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
వికారాబాద్:మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది.సోమవారం కార్తె ప్రవేశించడంతోవికారాబాద్,తాండూరు,పరిగి,కొడంగల్ పట్టణంలోని మార్కెట్లలోకి చేపలు విరివిగా వచ్చాయి. చేపల కొనుగోలు కోసం ప్రజలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.ఒకప్పుడు మనకు చేపలు కావాలంటే బయటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల ఇప్పుడు సొంతూళ్లలోనే చెరువుల్లో చేపల పెంపకం జరుగుతోంది. దీంతో చేపల ఉత్పత్తి పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. అయితే వికారాబాద్ పట్టణంలో మృగశిర కార్తె సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని రకాల చేపలను ఏర్పాటు చేసిన దుకాణం మనకు పైన చిత్రంలో కనిపిస్తుంది.
మృగశిరకు మస్తు చేపలు – వికారాబాద్ లో చేపలకు ఆసక్తి చూపుతున్న ప్రజలు
మృగశిరకు మస్తు చేపలు
- వికారాబాద్ లో చేపలకు ఆసక్తి చూపుతున్న ప్రజలు