ఉపాధి హామీ పనిస్థలంలో అరుదైన వివాహ వార్షికోత్సవ వేడుకలు
31 ఏళ్ల దాంపత్య బంధానికి తోటి కూలీల వినూత్న సత్కారం
అడవి పూలు, సొరకాయతో దండలు.. తలంబ్రాలతో సంప్రదాయ పెళ్లి సంబరం
ధనికులకే కాదు.. ఆనందానికి హద్దులు లేవని నిరూపించిన కూలీలు
అంతారం గ్రామంలో ఆటపాటల మధ్య సందడిగా వివాహ వార్షికోత్సవం
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మానవీయ విలువలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఓ ప్రత్యేక వేడుక అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా వివాహ వార్షికోత్సవాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు తమ సహచర దంపతుల 31వ వివాహ వార్షికోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.
మంగళవారం అంతారం గ్రామంలో
ఉదయం ఎప్పటిలాగే ఉపాధి హామీ పనుల కోసం వెళ్లిన కూలీలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. పనులు పూర్తయిన అనంతరం అదే గ్రామానికి చెందిన జంగని సుగుణమ్మ, మొగులయ్య దంపతుల వివాహ వార్షికోత్సవం ఉన్నట్లు తోటి కూలీలు గుర్తించారు. దీంతో వారిద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
పనిస్థలం పరిసరాల్లో లభించిన అడవి పూలను సేకరించి అందమైన దండలు తయారు చేశారు. అక్కడే ఉన్న పొడవాటి సొరకాయను వినూత్నంగా ఉపయోగించి ప్రత్యేక దండను రూపొందించారు. అనంతరం సంప్రదాయ పెళ్లిళ్లలో జరిగే విధంగా తలంబ్రాలు పోసి, ఆటపాటలతో సందడి చేశారు. మహిళా కూలీలు మంగళహారతులు పాడగా, పురుషులు కూడా ఉత్సాహంగా పాల్గొని నిజమైన పెళ్లి వేడుకను తలపించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేడుకలో పాల్గొన్న కూలీలు తమ సహచర దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సాదాసీదా జీవితాన్ని గడిపే కూలీలు కూడా ఆనందాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ ఇలాంటి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడ్డారు.
ధనం ఉంటేనే సంబరాలు చేసుకోవచ్చనే భావనను చెరిపేస్తూ, ప్రేమ, అనుబంధం, పరస్పర గౌరవం ఉంటే చిన్న సందర్భాన్నీ పెద్ద పండుగలా మార్చుకోవచ్చని అంతారం గ్రామ ఉపాధి హామీ కూలీలు నిరూపించారు. గ్రామంలో ఇలాంటి వేడుక ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదేమోనని గ్రామస్తులు సైతం చర్చించుకుంటూ కూలీల ఐక్యతను అభినందించారు.
సాధారణ కూలీల మధ్య వెలిసిన ఈ అపూర్వమైన వేడుక ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ఉపాధి హామీ పనిస్థలంలో అరుదైన వివాహ వార్షికోత్సవ వేడుకలు
ఉపాధి హామీ పనిస్థలంలో అరుదైన వివాహ వార్షికోత్సవ వేడుకలు
31 ఏళ్ల దాంపత్య బంధానికి తోటి కూలీల వినూత్న సత్కారం
అడవి పూలు, సొరకాయతో దండలు.. తలంబ్రాలతో సంప్రదాయ పెళ్లి సంబరం
ధనికులకే కాదు.. ఆనందానికి హద్దులు లేవని నిరూపించిన కూలీలు
అంతారం గ్రామంలో ఆటపాటల మధ్య సందడిగా వివాహ వార్షికోత్సవంవికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మానవీయ విలువలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఓ ప్రత్యేక వేడుక అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా వివాహ వార్షికోత్సవాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు తమ సహచర దంపతుల 31వ వివాహ వార్షికోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.