ప్రతిభకు అండగా నిలిచిన RBOL సంస్థ

అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైన గాజిపూర్ యువ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్‌కు RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం

ప్రతిభకు అండగా నిలిచిన RBOL సంస్థ
రైతు కుటుంబం నుంచి ప్రపంచ వేదికపైకి హర్షవర్ధన్ ప్రయాణం
క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హామీ
మలేషియాలో స్వర్ణ పతకం సాధించి తాండూర్‌కు పేరు తీసుకురావాలని ఆకాంక్ష

తాండూర్ నియోజకవర్గంపెద్దేముల్ మండలం గాజిపూర్ గ్రామానికి చెందిన జాతీయ స్థాయి సెయిలింగ్ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ నెల 24వ తేదీ నుంచి మలేషియాలోని లంఖావిలో నిర్వహించనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు భారత జట్టు తరఫున ఆయన ఎంపిక కావడం గాజిపూర్ గ్రామంతో పాటు తాండూర్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న హర్షవర్ధన్, తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే బెంగళూరులోని ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి ఎంపికయ్యాడు. గత ఐదు సంవత్సరాలుగా అక్కడే శిక్షణ పొందుతూ సెయిలింగ్ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి భారత సెయిలింగ్ అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన ఖర్చులు అధికంగా ఉండటంతో, రైతు కుటుంబానికి చెందిన ఆయన తండ్రి ఎర్రా చిన్న ఎల్లప్ప (యేసు) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గాజిపూర్ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల ద్వారా తెలుసుకున్న ఆర్‌బీఓఎల్ (RBOL) సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి స్పందించి, హర్షవర్ధన్ ప్రతిభను గుర్తించి రూ.1,50,000 విలువైన చెక్కును అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు.

ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..

ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదు అని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ,హర్షవర్ధన్ మలేషియాలో జరిగే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి గాజిపూర్ గ్రామంతో పాటు తాండూర్ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నానీ తెలిపారు. క్రీడాకారులకు మా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని అన్నారు.
జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగిన హర్షవర్ధన్‌కు గ్రామ ప్రజలు, యువత, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన విజయవంతంగా తిరిగి రావాలని ఆకాంక్షిచారు.

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన RBOL సంస్థ, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ సహాయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతిభకు అండగా నిలిచిన RBOL సంస్థ

అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైన గాజిపూర్ యువ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్‌కు RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం

ప్రతిభకు అండగా నిలిచిన RBOL సంస్థ
రైతు కుటుంబం నుంచి ప్రపంచ వేదికపైకి హర్షవర్ధన్ ప్రయాణం
క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హామీ
మలేషియాలో స్వర్ణ పతకం సాధించి తాండూర్‌కు పేరు తీసుకురావాలని ఆకాంక్ష

తాండూర్ నియోజకవర్గంపెద్దేముల్ మండలం గాజిపూర్ గ్రామానికి చెందిన జాతీయ స్థాయి సెయిలింగ్ క్రీడాకారుడు ఎర్రా హర్షవర్ధన్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ నెల 24వ తేదీ నుంచి మలేషియాలోని లంఖావిలో నిర్వహించనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు భారత జట్టు తరఫున ఆయన ఎంపిక కావడం గాజిపూర్ గ్రామంతో పాటు తాండూర్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న హర్షవర్ధన్, తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే బెంగళూరులోని ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి ఎంపికయ్యాడు. గత ఐదు సంవత్సరాలుగా అక్కడే శిక్షణ పొందుతూ సెయిలింగ్ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి భారత సెయిలింగ్ అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన ఖర్చులు అధికంగా ఉండటంతో, రైతు కుటుంబానికి చెందిన ఆయన తండ్రి ఎర్రా చిన్న ఎల్లప్ప (యేసు) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గాజిపూర్ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల ద్వారా తెలుసుకున్న ఆర్‌బీఓఎల్ (RBOL) సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి స్పందించి, హర్షవర్ధన్ ప్రతిభను గుర్తించి రూ.1,50,000 విలువైన చెక్కును అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు.

ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..

ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదు అని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ,హర్షవర్ధన్ మలేషియాలో జరిగే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి గాజిపూర్ గ్రామంతో పాటు తాండూర్ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నానీ తెలిపారు. క్రీడాకారులకు మా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని అన్నారు.
జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగిన హర్షవర్ధన్‌కు గ్రామ ప్రజలు, యువత, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన విజయవంతంగా తిరిగి రావాలని ఆకాంక్షిచారు.

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన RBOL సంస్థ, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ సహాయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

🗓 10 Jun 2026 | 02:45 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top