ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు కోసం తాండూరులో ప్రత్యేక సంకల్ప పూజలు

12 ఏళ్ల పాలనలో రికార్డు సృష్టించిన మోదీకి రామమందిరంలో ప్రత్యేక ప్రార్థనలు

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇంద్రానగర్‌లో ఘనంగా పూజా కార్యక్రమం

దేశాన్ని విశ్వగురువుగా నిలపాలని భగవంతుని ప్రార్థించిన బీజేపీ నాయకులుభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవలో పుష్కర కాలమైన 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4,400 రోజులపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించిన సందర్భంగా తాండూరులో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యేక సంకల్ప పూజలు నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాండూర్ పట్టణంలోని ఇంద్రానగర్ రామమందిరంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చిరకాలం ప్రజాసేవ కొనసాగించాలని, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపి విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీరామచంద్రుని సన్నిధిలో ప్రత్యేక సంకల్ప పూజలు నిర్వహించారు. 140 కోట్ల భారత ప్రజల ఆశీస్సులు, మద్దతు ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ ఉంటాయని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్ కుమార్, బంటారం భద్రేశ్వర్, 23వ వార్డు కౌన్సిలర్ కిరణ్ కుమార్, 33వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, మోత్కుపల్లి చంద్రశేఖర్, ఇందరు రాములు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బండారు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, రాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

🗓 11 Jun 2026 | 07:39 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top