‘రక్షణ నేత్రం – సురక్ష మిత్ర’.. పై విద్యార్థులకు భద్రతా పాఠాలు చెప్పిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన “రక్షణ నేత్రం – సురక్ష మిత్ర” అవగాహన కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడమే రక్షణ నేత్రం – సురక్ష మిత్ర కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేష్ రెడ్డి, కౌన్సిలర్లు జంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐ పరమేష్, ఎస్‌ఐలు విట్టల్ రెడ్డి, నుమన్ అలీ, వినోద్ రాథోడ్, ప్రశాంత్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

‘రక్షణ నేత్రం – సురక్ష మిత్ర’.. పై విద్యార్థులకు భద్రతా పాఠాలు చెప్పిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

‘రక్షణ నేత్రం – సురక్ష మిత్ర’.. పై విద్యార్థులకు భద్రతా పాఠాలు చెప్పిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన "రక్షణ నేత్రం – సురక్ష మిత్ర" అవగాహన కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడమే రక్షణ నేత్రం – సురక్ష మిత్ర కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేష్ రెడ్డి, కౌన్సిలర్లు జంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐ పరమేష్, ఎస్‌ఐలు విట్టల్ రెడ్డి, నుమన్ అలీ, వినోద్ రాథోడ్, ప్రశాంత్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🗓 20 Jun 2026 | 05:20 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top