తాండూరులో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై బి ఆర్ఎస్ఎస్వి ఆగ్రహం

తాండూరు లోని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ కమిటీ సభ్యులు ఆరోపించారు.ఈ నేపథ్యంలో శనివారం తాండూరు మండల విద్యాధికారి కార్యాలయంలో బీఆర్ఎస్వీ నాయకులు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డొనేషన్లు, ఇతర పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బెంచీలు, ప్రయోగశాలలు వంటి మౌలిక వసతులు సరిగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తక్షణ తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులను నియంత్రించాలని, అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలగే
ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే మండల వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, కొర్ర సందీప్ నాయక్, షోహెబ్, భాను, మజార్, తోఫిక్ తదితరులు పాల్గొన్నారు.

🗓 20 Jun 2026 | 06:16 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top