అందరం యోగ చేద్దాం. …ఆరోగ్యంగా జీవిద్దాం. ….
– మానసిక ప్రశాంతతకు యోగా దోహదం
– అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, జూన్ 21 : ప్రశాంతతకు యోగా దోహదం పడుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారంఅంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పతంజలి యోగ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో విలియం మూన్ గ్రౌండ్లో నిర్వహించిన సామూహిక యోగా అభ్యాస కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పతంజలి యోగ సమితి సభ్యులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో త్వరలో స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యోగా అనేది కేవలం ఒక రోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి నిత్యం యోగ చేయాలని సూచించారు. యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. యువత యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు.
తాండూరును ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన, అభివృద్ధి చెందిన, మాదకద్రవ్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే జీవితం వృధా అన్నారు. ఆరోగ్యం తోపాటు సంపద ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు యోగ చేసి ఆరోగ్య వాంతులుగా జీవించాలని కోరారు. అనంతరం పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన మెగా శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. యోగ సభ్యులు సుమారుగా 30మంది రక్త ధానం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, డిఎస్పీ నర్సింగ్ యాదయ్య, పతంజలి యోగ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు ప్రవీణ్ కుమార్,ప్రధాన కార్యదర్శి లక్ష్మన్, సలహాదారులు శ్రీనివాస్, కోశాధికారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు, మాజీ చైర్మన్ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్, వివిధ పార్టీల నాయకులు కరణం పురుషోత్తం రావు, బంటు వేణు, శ్రీకాంత్ రెడ్డి, నాగారం మల్లేశం, ఆర్య సమాజ్ ప్రతినిధులు, సోషల్ వెల్ఫేర్, బీసీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు , వివిధ సంఘాల ప్రతినిధులు, పతంజలి యోగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అందరం యోగ చేద్దాం. …ఆరోగ్యంగా జీవిద్దాం. ….
అందరం యోగ చేద్దాం. ...ఆరోగ్యంగా జీవిద్దాం. ....
- మానసిక ప్రశాంతతకు యోగా దోహదం
- అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి