మహిళల భద్రతే లక్ష్యంగా షీ టీమ్ అవగాహన కార్యక్రమం
విద్యార్థులకు మహిళలపై నేరాలు, సైబర్ మోసాల పై అవగాహన
గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం పై వివరించిన ఏఎస్ఐ శేఖర్
వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాలలో సబ్ డివిజన్ షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “మహిళల భద్రతే మా లక్ష్యం” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇంచార్జ్ ఏఎస్ఐ శేఖర్ విద్యార్థులకు పలు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలు, నిర్భయ చట్టం, పోక్సో చట్టం, అత్యవసర సేవల కోసం డయల్-100, షీ టీమ్ హెల్ప్‌లైన్-181, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్ వినియోగంపై వివరించారు.
అలాగే సీసీ కెమెరాల ప్రాధాన్యత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా నిరోధం, మద్యపాన నిషేధం, ట్రాఫిక్ నిబంధనలు, బ్యాంకింగ్ ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ, గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిషేధం, జెండర్ ఈక్వాలిటీ వంటి పలు అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యురాలు రోహిణి, పాఠశాల డైరెక్టర్ శ్రీమతి మణిమల రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం పై వివరించిన ఏఎస్ఐ శేఖర్
మహిళల భద్రతే లక్ష్యంగా షీ టీమ్ అవగాహన కార్యక్రమం
విద్యార్థులకు మహిళలపై నేరాలు, సైబర్ మోసాల పై అవగాహన
గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం పై వివరించిన ఏఎస్ఐ శేఖర్వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాలలో సబ్ డివిజన్ షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. "మహిళల భద్రతే మా లక్ష్యం" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇంచార్జ్ ఏఎస్ఐ శేఖర్ విద్యార్థులకు పలు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.