శివసాగర్ ప్రాజెక్టులో అనుమానాస్పద పనులు.. అక్రమ ఇసుక రవాణా పై బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

శివసాగర్ ప్రాజెక్టులో అనుమానాస్పద పనులు..

అక్రమ ఇసుక రవాణా పై బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

శివసాగర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రభుత్వ అధికారులు

ప్రాజెక్ట్‌లో చేసిన పనులకు చేపలకు, పర్యావరణానికి ముప్పు:

వెంటనే పనులు నిలిపివేయాలని బి ఆర్ఎస్ నేత రవీందర్ డిమాండ్

అనుమతుల రద్దు, వాహనాల సీజ్‌ నివేదిక అందజేస్తాం..

తహసీల్దార్ గాయత్రి, ఇరిగేషన్ ఏఈ భాను రెడ్డి

యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న పనులు అక్రమ ఇసుక రవాణాకు దారితీసేలా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లో అనుమానాస్పదంగా జరుగుతున్న పనులపై సమాచారం అందుకున్న బిఆర్‌ఎస్ నాయకుడు రవీందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యాలాల తహసీల్దార్‌ను కలిసి విషయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ,..
ఇటీవల యాలాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ఇసుక వేలం పారదర్శకంగా నిర్వహించకుండా ఏకపక్షంగా ఒక్కరికే కేటాయించారని ఆరోపించారు. ప్రస్తుతం శివసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో టిప్పర్ల ద్వారా శిల్ప ముక్కలను తరలించి దారిని ఏర్పాటు చేయడం వెనుక అక్రమ ఇసుక రవాణాకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్‌లో చేపల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతకు కూడా ఈ పనులు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ పనులను నిలిపివేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
బిఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు యాలాల తహసీల్దార్ గాయత్రి, ఇరిగేషన్ శాఖ ఏఈ భానురెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…, మొత్తం అంశంపై పై అధికారులకు నివేదిక సమర్పించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు అనుమతులను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే, మట్టి చదును చేసేందుకు ఇచ్చిన అనుమతులను మించి లోతుగా తవ్వకాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలన అనంతరం అక్కడ ఉన్నది ఇసుక మట్టా లేదా సాధారణ మట్టా అనే అంశంపై నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాఘవాపూర్ వెంకటయ్య, శేఖర్ రెడ్డి, కరణం విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

శివసాగర్ ప్రాజెక్టులో అనుమానాస్పద పనులు.. అక్రమ ఇసుక రవాణా పై బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

శివసాగర్ ప్రాజెక్టులో అనుమానాస్పద పనులు..

అక్రమ ఇసుక రవాణా పై బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

శివసాగర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రభుత్వ అధికారులు

ప్రాజెక్ట్‌లో చేసిన పనులకు చేపలకు, పర్యావరణానికి ముప్పు:

వెంటనే పనులు నిలిపివేయాలని బి ఆర్ఎస్ నేత రవీందర్ డిమాండ్

అనుమతుల రద్దు, వాహనాల సీజ్‌ నివేదిక అందజేస్తాం..

తహసీల్దార్ గాయత్రి, ఇరిగేషన్ ఏఈ భాను రెడ్డి

యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న పనులు అక్రమ ఇసుక రవాణాకు దారితీసేలా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లో అనుమానాస్పదంగా జరుగుతున్న పనులపై సమాచారం అందుకున్న బిఆర్‌ఎస్ నాయకుడు రవీందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యాలాల తహసీల్దార్‌ను కలిసి విషయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ,..
ఇటీవల యాలాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ఇసుక వేలం పారదర్శకంగా నిర్వహించకుండా ఏకపక్షంగా ఒక్కరికే కేటాయించారని ఆరోపించారు. ప్రస్తుతం శివసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో టిప్పర్ల ద్వారా శిల్ప ముక్కలను తరలించి దారిని ఏర్పాటు చేయడం వెనుక అక్రమ ఇసుక రవాణాకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్‌లో చేపల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతకు కూడా ఈ పనులు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ పనులను నిలిపివేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
బిఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు యాలాల తహసీల్దార్ గాయత్రి, ఇరిగేషన్ శాఖ ఏఈ భానురెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..., మొత్తం అంశంపై పై అధికారులకు నివేదిక సమర్పించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు అనుమతులను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే, మట్టి చదును చేసేందుకు ఇచ్చిన అనుమతులను మించి లోతుగా తవ్వకాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలన అనంతరం అక్కడ ఉన్నది ఇసుక మట్టా లేదా సాధారణ మట్టా అనే అంశంపై నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాఘవాపూర్ వెంకటయ్య, శేఖర్ రెడ్డి, కరణం విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

🗓 22 Jun 2026 | 08:35 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top